చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ చరిత్ర సృష్టించాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు మేర లాభపడింది. దీంతో గరిష్టంగా 63,523కి దూసుకెళ్లింది.
దీంతో ఆల్ టైమ్ టాప్ రేంజ్ ను తాకినట్లైంది. మరోవైపు నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 18,857కు ఎగబాకింది. అయినప్పటికీ గరిష్ట స్థాయి రికార్డు 18,888 కంటే 12 పాయింట్లు మాత్రమే తక్కువగా ట్రేడ్ అయ్యింది.
2022 డిసెంబర్ 1న 63 వేల 583 పాయింట్లతో సెన్సెక్స్ రికార్డు కొట్టింది. ఈ నేపథ్యంలో షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి.
అయితే, స్టాక్ మార్కెట్లు టాప్ స్కోర్ తర్వాత, సెన్సెక్స్ నిఫ్టీ రెండింటి పాయింట్లు మేర క్షీణించాయి.
DETAILS
పాత రికార్డులను బద్దలుకొట్టిన సెన్సెక్స్ సూచీ
ఇప్పుడు మరోసారి పాత రికార్డులను బద్దలుకొట్టి మార్నింగ్ ట్రేడింగ్ సెషన్ లో 63, 588 పాయింట్లకు సెన్సెక్స్ చేరుకోవడం విశేషం.
ఈ మేరకు ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు షేర్ మార్కెట్లో ఉత్సాహాన్ని రెకెత్తించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల షేర్లు :
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.68%),
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (1.71%),
హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ (1.66%),
టెక్ మహీంద్రా (1.13%),
టీసీఎస్ (0.94%).
నష్టాల షేర్లు :
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.59%),
ఐటీసీ (-1.29%),
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.87%),
యాక్సిస్ బ్యాంక్ (-0.83%),
బజాజ్ ఫైనాన్స్ (-0.62%).