Stock market: నాలుగోరోజూ ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఎక్కువగా స్థిరంగా కొనసాగాయి.ఉదయం కొంత నష్టంతో ప్రారంభమైన సూచీలు,తర్వాత కొద్దిగా లాభపడినప్పటికీ, చివరికి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్ట ప్రాంతంలోకి వెళ్ళి స్వల్ప నష్టాల వద్ద ముగిశాయి. ఫైనాన్షియల్, టెక్నాలజీ, మెటల్ రంగంలోని షేర్లలో కొనుగోలు మద్దతు కనిపించగా, ఆటోమొబైల్, మీడియా, ఫార్మా,కెమికల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా గమనించబడింది. సెన్సెక్స్ ఉదయం 84,518.33 పాయింట్ల వద్ద (గత ముగింపు 84,559.65) నష్టంతో ప్రారంభమై, ఇంట్రాడేలో 84,238.43 నుంచి 84,780.19 వరకు కదలాడింది. చివరికి 77.84 పాయింట్ల నష్టంతో 84,481.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కేవలం 3 పాయింట్ల నష్టంతో 26,815.55 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో 90.26 వద్ద ఉంది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 59.82 డాలర్లు
సెన్సెక్స్ 30లో సన్‌ఫార్మా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 59.82 డాలర్ల వద్ద ఉండగా, బంగారం 4,325 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.