Stock market : భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 26వేల దిగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి. ముఖ్యంగా మెటల్, రియల్టీ, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 26 వేల దిగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 85,025.61 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 85,213.36)నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,620.61 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీ.. చివరికి 533.50 పాయింట్ల నష్టంతో 84,679.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 167.20 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 91.04గా ఉంది.
వివరాలు
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 59.53 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎటెర్నెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 59.53డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 4,280.13 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీ లో యాక్సిస్ బ్యాంక్, ఎటెర్నెల్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపడ్డాయి. టైటాన్, భరతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్ షేర్లు లాభంలో ముగిశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 59.53 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,280.13 వద్ద కొనసాగుతోంది.