Loading...
Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఘర్షణల ఉద్రిక్తతలు తగ్గడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊరటనివ్వడంతో, వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను ఎదుర్కొన్న ప్రధాన సూచీలు మళ్లీ పుంజుకుని గ్రీన్‌జోన్‌లో ట్రేడవుతున్నాయి.

వివరాలు 

స్వల్పంగా కోలుకున్న రూపాయి మారకం విలువ

ఉదయం 9.47 గంటల సమయానికి సెన్సెక్స్‌ 627 పాయింట్లు పెరిగి 76,692 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 23,948 వద్ద ట్రేడవుతోంది.

ఇదే సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా కోలుకుని ₹96.18 వద్ద ప్రారంభమైంది.

నిఫ్టీ సూచీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌, ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మరోవైపు ఓఎన్‌జీసీ, విప్రో, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT