Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు మరో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, మంగళవారం భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ మంచి స్థితిలో ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 253.23 పాయింట్ల లాభంతో 80,363 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 24,304 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.24 వద్ద కొనసాగుతోంది.
మంచి ప్రదర్శన చేసిన జొమాటో
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. అదే సమయంలో, ఆల్ట్రా టెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీలో జొమాటోని కొత్తగా చేరుస్తున్నట్లు ప్రకటించడంతో ఆ కంపెనీ షేరు మంచి ప్రదర్శన చేసింది. ఈ రోజు కూడా మదుపరులు జొమాటో షేర్లపై మరింత దృష్టి పెడుతున్నారు.