Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 71 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. హర్మూజ్ జలసంధి వద్ద నౌకల దిగ్బంధనానికి పాల్పడతామంటూ అమెరికా హెచ్చరించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో రోజంతా సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనై చివరకు నష్టాల్లో స్థిరపడ్డాయి.
వివరాలు
సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టం
సెన్సెక్స్ ఉదయం 77,903.43 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది.
క్రితం ముగింపు 78,079.96 పాయింట్లు. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 77,684.37 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
చివరికి 71 పాయింట్లు కోల్పోయి 78,009.25 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ముగించింది.
29.85 పాయింట్లు తగ్గి 24,366 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.43గా ఉంది
వివరాలు
ఈ షేర్లకు నష్టాలు.. ఆ షేర్లకు లాభాలు
సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఇండిగో, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి.
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి.
ముడి చమురు, బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 87 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ఔన్సు ధర 4,355 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.