Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 180 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం స్వల్ప మార్పులతో ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ, రోజు ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. కొనుగోళ్ల ఊపు పెరగడంతో కీలక సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 180.83 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 77,835.43 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46.30 పాయింట్లు (0.19 శాతం) పెరిగి 24,296.50 వద్ద ముగిసింది. రోజంతా జరిగిన ట్రేడింగ్‌లో పలు షేర్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించాయి.
వివరాలు
నష్టాల్లో పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్
బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రెడింగ్టన్ లిమిటెడ్, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
అదే సమయంలో పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై టాప్ లూజర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.