LOADING...
Stock market: ప్రారంభంలో జోరు.. నష్టాల్లో ముగిసిన సూచీలు, పడిపోయిన రూపాయి
ప్రారంభంలో జోరు.. నష్టాల్లో ముగిసిన సూచీలు, పడిపోయిన రూపాయి

Stock market: ప్రారంభంలో జోరు.. నష్టాల్లో ముగిసిన సూచీలు, పడిపోయిన రూపాయి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై క్రమంగా దిగజారాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్ రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాలు నమోదవడంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు రూపాయి విలువ పతనం కొనసాగడం కూడా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 96.61 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి 96.52 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ ఉదయం 75,441.27 వద్ద లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది.

వివరాలు

నష్టాల్లోకి సెన్సెక్స్

ఇది గత ముగింపు స్థాయి 75,315.04 కంటే ఎక్కువ. ట్రేడింగ్ సమయంలో సూచీ 75,746.27 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 114.19 పాయింట్లు కోల్పోయి 75,200.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే దారిలో సాగి 31.95 పాయింట్లు తగ్గి 23,618 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ, భారతి ఎయిర్‌టెల్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ముగిశాయి.

వివరాలు

బంగారం ధర ఔన్సుకు 4540 డాలర్ల వద్ద ట్రేడ్

అదే సమయంలో ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ధర ఔన్సుకు 4540 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement