
blinkit - AC: వేసవి స్పెషల్.. 10 నిమిషాల్లో ఏసీ డెలివరీ.. బ్లింకిట్ సరికొత్త ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాయి.
మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీకే పరిమితమైన ఈ కంపెనీలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే డెలివరీ చేయడం ప్రారంభించాయి.
తాజాగా జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక అడుగు వేసింది. ఇకపై ఏసీలను కూడా 10 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
వేసవిలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్ ఈ కొత్త సేవను ప్రారంభించింది.
Details
త్వరలో మరిన్ని నగరాలకు విస్తరణ
ఇందుకోసం ప్రముఖ ఏసీ తయారీ సంస్థ లాయిడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
లాయిడ్ బ్రాండ్‌కు చెందిన వివిధ రకాల ఏసీలను కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించనున్నట్లు బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ దిండ్సా తెలిపారు.
ప్రస్తుతానికి దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుందని, త్వరలో మరిన్ని నగరాలకు విస్తరిస్తామని వెల్లడించారు.
డెలివరీ అయిన తర్వాత 24 గంటల్లోగా ఇన్‌స్టలేషన్ సిబ్బంది ఏసీని కోరిన ప్రదేశంలో ఫిక్స్ చేస్తారని పేర్కొన్నారు.