'ఫస్ట్‌క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు
ఆన్‌లైన్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ ప్లాట్‌ఫారమ్ 'ఫస్ట్‌క్రై.కామ్' వ్యవస్థాపకుడు సుపమ్ మహేశ్వరి పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పన్నులు చెల్లించనందుకు ఐటీ అధికారులు ఫస్ట్‌క్రై సహవ్యవస్థాపకుడు, సీఈఓ సుపమ్ మహేశ్వరికి నోటీసులు పంపినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మహేశ్వరి పన్ను ఎగవేతపై ఐటీశాఖ దర్యాప్తు చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ అవకతవకలపై విచారణ కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కో, సునీల్ భారతి మిట్టల్ కుటుంబ కార్యాలయంతో సహా ఫస్ట్‌క్రైలోని ఆరుగురు పెట్టుబడిదారులను ఐటీశాఖ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మహేశ్వరి ప్రస్తుతం పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.