LOADING...
Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు 
Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Jan 24, 2024
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూ.కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అతని సోదరుడు ధీరజ్‌లకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, కింది కోర్టులు తప్పు చేశాయని న్యాయమూర్తులు బేల త్రివేది, ఎస్‌సీ శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత 60 లేదా 90రోజులలోపు క్రిమినల్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే, నిందితుడు చట్టబద్ధమైన బెయిల్‌కు అర్హులు అవుతాడు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 88వ రోజున సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడంతో నిందితులు బెయిల్‌కు అర్హులు కాదని ధర్మాసనం పేర్కొంది. రుణ కుంభకోణం కేసులో గత ఏడాది జూలై 19న వాధ్వాన్ సోదరులను అరెస్టు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు