LOADING...
Swiggy: స్విగ్గీ షాక్: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు.. ఒక్కో ఆర్డర్‌కు అదనపు ఛార్జ్!
స్విగ్గీ షాక్: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు.. ఒక్కో ఆర్డర్‌కు అదనపు ఛార్జ్!

Swiggy: స్విగ్గీ షాక్: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు.. ఒక్కో ఆర్డర్‌కు అదనపు ఛార్జ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుడ్ డెలివరీ యాప్‌లు మరోసారి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో స్విగ్గీ కూడా నడిచింది. స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14.99 నుంచి రూ.17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. అంటే ప్రతి ఆర్డర్‌పై వినియోగదారులు అదనంగా రూ.2.59 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఇంధన కొరత కూడా సమస్యగా మారింది. ఈ కారణాల వల్ల ఆపరేషన్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో, ఆ భారం తగ్గించుకోవడానికే ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచుతున్నాయని సమాచారం.

వివరాలు 

2023 ఏప్రిల్ నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు

అయితే ఈ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ''డిస్కౌంట్లు, సబ్సిడీలు ఇచ్చే రోజులు ముగిశాయి. ఇప్పుడు కంపెనీలు లాభాల దశలోకి వచ్చాయి'' అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విగ్గీ తన యూనిట్ ఎకనామిక్స్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో 2023 ఏప్రిల్ నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. మొదట ఈ ఫీజు కేవలం రూ.2 మాత్రమే ఉండేది. ఆ తరువాత దాన్ని దశలవారీగా పెంచుతూ వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని రూ.14.99కి పెంచిన కంపెనీ, ఇప్పుడు మరోసారి సవరణ చేసింది. వినియోగదారుల దృష్టిలో ఈ పెంపు పెద్దగా అనిపించకపోయినా, రోజుకు లక్షల సంఖ్యలో ఆర్డర్లను డెలివరీ చేసే స్విగ్గీకి మాత్రం ఇది గణనీయమైన అదనపు ఆదాయాన్ని తీసుకురానుంది.

Advertisement