Loading...
Instamart: ఇన్‌స్టామార్ట్‌లో వంటగ్యాస్‌ సిలిండర్ల సేవ.. హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఒప్పందం
ఇన్‌స్టామార్ట్‌లో వంటగ్యాస్‌ సిలిండర్ల సేవ.. హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఒప్పందం

Instamart: ఇన్‌స్టామార్ట్‌లో వంటగ్యాస్‌ సిలిండర్ల సేవ.. హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
07:49 am

ఈ వార్తాకథనం ఏంటి

స్విగ్గీకి చెందిన క్విక్‌కామర్స్‌ విభాగం ఇన్‌స్టామార్ట్ వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరా కోసం హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో హెచ్‌పీసీఎల్‌ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన 10కిలోగ్రాముల ఎల్‌పీజీ సిలిండర్‌'హెచ్‌పీ నవ్య'ద్వారా సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ప్రారంభ దశలో ఈ సేవను బెంగళూరు నగరంలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇన్‌స్టామార్ట్‌ యాప్‌ ద్వారా హెచ్‌పీ నవ్య 10కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌తో పాటు 5కిలోల సిలిండర్‌ను కూడా ఆర్డర్‌ చేసుకునే అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది. అలాగే,సాధారణ గృహ వంటగ్యాస్‌ కనెక్షన్‌ లేని వారు కూడా ఈ సిలిండర్లను ఆర్డర్‌ చేసుకోవచ్చని ఇన్‌స్టామార్ట్‌ పేర్కొంది. ముఖ్యంగా అద్దెగదుల్లో నివసించే విద్యార్థులు,ఉద్యోగులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్విగ్గీలో వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరా సేవలు

ADVERTISEMENT