
Tata Capital IPO Allotment : టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ సులభంగా చెక్ చేసుకోండిలా..
ఈ వార్తాకథనం ఏంటి
టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ లిమిటెడ్ మెయిన్‌బోర్డ్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుండి గరిష్ట డిమాండ్ వచ్చింది. అక్టోబర్ 6 నుంచి 8 వరకు బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి అయింది.ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి అలాట్‌మెంట్ తేదీ పై ఉంది. టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ ఈ రోజు(అక్టోబర్ 9)ఖరారయ్యే అవకాశం ఉంది. అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, అర్హత సాధించిన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలలో షేర్లు అక్టోబర్ 10 నాటికి జమ చేయబడతాయి. అలాట్‌మెంట్ లో షేర్లు పొందనివారికి అదే రోజు రిఫండ్ ప్రారంభం అవుతుంది. ఐపీఓ లిస్టింగ్ తేదీ ఈ ఐపీఓ అక్టోబర్ 13న బీఎస్‌ఈ (BSE),ఎన్‌ఎస్‌ఈ (NSE)స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టింగ్ అవుతుంది.
వివరాలు
ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్
టాటా క్యాపిటల్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ త్వరలోనే ఖరారు కానుంది. ఈ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవడానికి పెట్టుబడిదారులు ఈ కింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. బీఎస్‌ఈ (BSE) వెబ్‌సైట్ ఎన్‌ఎస్‌ఈ (NSE) వెబ్‌సైట్ రిజిస్ట్రార్ పోర్టల్: MUFG Intime India Pvt. Ltd. 1. బీఎస్‌ఈ (BSE) ద్వారా చెక్ చేయడం బీఎస్‌ఈ వెబ్‌సైట్ సందర్శించండి. "Issue Type" లో Equity ఎంచుకోండి. "Issue Name" డ్రాప్‌డౌన్ నుండి Tata Capital Limited ఎంచుకోండి. మీ అప్లికేషన్ నంబర్ లేదా PAN నంబర్ నమోదు చేయండి. "I am not a robot" పై టిక్ చేసి, Search పై క్లిక్ చేయండి. అలాట్‌మెంట్ స్టేటస్ స్క్రీన్‌లో కనబడుతుంది.
వివరాలు
ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్
2. ఎన్‌ఎస్‌ఈ (NSE) ద్వారా చెక్ చేయడం ఎన్‌ఎస్‌ఈ అలాట్‌మెంట్ స్టేటస్ పేజీకి వెళ్లండి. "Equity and SME IPO Bids" ను ఎంచుకోండి. "Issue Name" లో Tata Capital Limited ఎంచుకోండి. PAN నంబర్, అప్లికేషన్ నంబర్ నమోదు చేయండి. Submit పై క్లిక్ చేయండి. మీ అలాట్‌మెంట్ వివరాలు కనిపిస్తాయి.
వివరాలు
ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్
3. రిజిస్ట్రార్ (MUFG Intime) ద్వారా చెక్ చేయడం MUFG Intime IPO Status Portal సందర్శించండి. "Select Company" డ్రాప్‌డౌన్ నుండి Tata Capital Limited ఎంచుకోండి. PAN, అప్లికేషన్ నెం., DP ID లేదా అకౌంట్ నంబర్ లో ఒకదాన్ని ఎంచుకోండి. వివరాలను నమోదు చేసి Search క్లిక్ చేయండి. మీ అలాట్‌మెంట్ వివరాలు కనిపిస్తాయి.
వివరాలు
జీఎంపీ (GMP) వివరాలు
అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో టాటా క్యాపిటల్ షేర్లు సతతమైన ట్రెండ్ చూపుతున్నాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ప్రస్తుతం ₹7 గా ఉంది. దీనర్థం, ఐపీఓ ఇష్యూ ధర ₹326 కంటే, అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో షేర్లు ₹7 ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతున్నాయి. ఇది అంచనా లిస్టింగ్ ధరను ₹333 (₹326 + ₹7) గా సూచిస్తోంది. అంటే, ఇది ఇష్యూ ధరకు సుమారు 2.15% ప్రీమియం అని అర్థం.
వివరాలు
కీ వివరాలు & సబ్‌స్క్రిప్షన్ స్థితి
ఐపీఓ కాలం: అక్టోబర్ 6 - అక్టోబర్ 8 సేకరించిన మొత్తం: ₹15,511.87 కోట్లు ధరల శ్రేణి (Price Band): ₹310 - ₹326 మొత్తం సబ్‌స్క్రిప్షన్: 1.95 రెట్లు కేటగిరీ వారీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBలు) 3.42 నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NIIలు) 1.98 రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ (RIIలు) 1.10 కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో. లిమిటెడ్ దీనికి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, MUFG Intime India Pvt. Ltd. రిజిస్ట్రార్‌గా ఉంది.