LOADING...
TCS: మెగా ఒప్పందం రద్దుకు సైబర్‌ దాడులు కారణం కావు: టీసీఎస్‌ స్పష్టత 
మెగా ఒప్పందం రద్దుకు సైబర్‌ దాడులు కారణం కావు: టీసీఎస్‌ స్పష్టత

TCS: మెగా ఒప్పందం రద్దుకు సైబర్‌ దాడులు కారణం కావు: టీసీఎస్‌ స్పష్టత 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)తో సుదీర్ఘకాలం కొనసాగిన బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాన్ని బ్రిటన్‌ రిటైల్‌ సంస్థ మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌(M&S)ముగించింది. అయితే, యూకే మీడియా సంస్థ టెలిగ్రాఫ్‌ ప్రచురించిన కథనంలో.. "సైబర్‌ దాడుల సమయంలో టీసీఎస్‌ భద్రతా వైఫల్యాల వల్లే ఈ కాంట్రాక్ట్‌ పునరుద్ధరించబడలేదు" అని పేర్కొంది. దీనిపై టీసీఎస్‌ స్పందిస్తూ,ఆ వార్తలను తోసిపుచ్చింది. అవన్నీ వాస్తవానికి విరుద్ధమని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికలో తెలిపింది. మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌కు టీసీఎస్‌ గత కొన్ని సంవత్సరాలుగా టెక్నాలజీ హెల్ప్‌డెస్క్‌ సేవలు అందిస్తోంది. అయితే,ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ బ్రిటిష్‌ రిటైలర్‌పై జరిగిన సైబర్‌ దాడి వల్ల సంస్థకు దాదాపు 300మిలియన్‌ పౌండ్ల ఆర్థిక నష్టం సంభవించింది.

వివరాలు 

టైల్‌ సంస్థ హెల్ప్‌డెస్క్‌ సేవలను మరో సంస్థకు అప్పగించాలని నిర్ణయం 

ఈ నేపథ్యంలోనే M&S టీసీఎస్‌తో ఉన్న బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని ది టెలిగ్రాఫ్‌ తమ కథనంలో పేర్కొంది. దీనిపై టీసీఎస్‌ స్పందించింది.యూకే మీడియాలో ప్రచురితమైన కథనంలో అనేక తప్పుడు వివరాలు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ విలువ,ముగింపు తీరు వంటి అంశాలపై ఉన్న సమాచారం పూర్తిగా నిరాధారం. మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ సర్వీస్‌ డెస్క్‌ కాంట్రాక్ట్‌ కోసం టెండర్‌ ప్రక్రియ ఈ ఏడాది జనవరిలోనే జరిగింది,అంటే ఏప్రిల్‌లో జరిగిన సైబర్‌ దాడులకు ముందే. అప్పటికే ఆ రిటైల్‌ సంస్థ హెల్ప్‌డెస్క్‌ సేవలను మరో సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. కాబట్టి, సైబర్‌ దాడులకు ఈ ఒప్పందం ముగింపుతో ఏ మాత్రం సంబంధం లేదు.

వివరాలు 

మా సిస్టమ్స్‌పై ఎలాంటి సైబర్‌ దాడులు జరగలేదు

ఆ కథనం వాస్తవాధారాలు లేని దుష్ప్రచారం మాత్రమే. మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌తో మాకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇంకా కొనసాగుతోంది. ఇతర విభాగాల్లో కూడా దీర్ఘకాలిక సహకారం కొనసాగించడం మాకు గర్వకారణం" అని టీసీఎస్‌ తమ నివేదికలో పేర్కొంది. అదే విధంగా, ఏప్రిల్‌లో చోటుచేసుకున్న సైబర్‌ దాడుల గురించి టీసీఎస్‌ మరింత స్పష్టతనిచ్చింది. "మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌కు మేము సైబర్‌ సెక్యూరిటీ సేవలు అందించలేదు. అలాగే మా నెట్‌వర్క్‌లు, సిస్టమ్స్‌ అన్నింటినీ జాగ్రత్తగా తనిఖీ చేశాం. మా సిస్టమ్స్‌పై ఎలాంటి సైబర్‌ దాడులు జరగలేదు" అని భారత ఐటీ సంస్థ స్పష్టం చేసింది.