LOADING...
TCS Q2 Results: TCS నికర లాభం రూ.12,075 కోట్లు.. షేరు ధరలో 1.16% పెరుగుదల.. ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్‌ 
ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్

TCS Q2 Results: TCS నికర లాభం రూ.12,075 కోట్లు.. షేరు ధరలో 1.16% పెరుగుదల.. ఒక్కో షేరుపై రూ.11 డివిడెండ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. టీసీఎస్ ఫలితాలతోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభమైంది. కంపెనీ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.12,075 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో అదే త్రైమాసికంలో నమోదైన నికర లాభం (రూ.11,909 కోట్ల)తో పోలిస్తే 1.39 శాతం పెరుగుదల అని సూచిస్తుంది.

వివరాలు 

ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ 

నిర్వహణ లాభం 2.39 శాతం పెరిగి రూ.65,799 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నిర్వహణ లాభం రూ.64,259 కోట్లుగా నమోదైంది. మరీ కొన్ని నెలల క్రితం త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే, ఈసారి లాభం 5.3 శాతం తగ్గగా, ఆదాయం 3.7 శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది. అదనంగా, టీసీఎస్ ఈ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ ఫలితాల ప్రకారం, గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర రూ.3,061.95 వద్ద ముగిసింది, ఇది గత ముగింపుతో పోలిస్తే 1.16 శాతం పెరుగుదలగా ఉంది.