Page Loader
భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం 
ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం

భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 12, 2023
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ, దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ లాభాల పంట పండించింది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ.11,342 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)ను ఆర్జించింది.​ గతేడాది రెండో క్వార్టర్​లో కంపెనీ రూ.10,431 కోట్ల లాభాన్నే ప్రకటించింది. ఇది 8.7 శాతం వార్షిక వృద్ధితో సమానమని తెలిపింది. కార్యకలాపాల ద్వారా ఈసారి వచ్చిన ఆదాయం రూ.59,692 కోట్లకు చేరుకోగా, 2022 రెండో క్వార్టర్​లో వచ్చిన రూ.55,309 కోట్లతో పోలిస్తే దాదాపు 8 శాతానికి ఎగబాకింది. ఈ క్రమంలోనే మొత్తం ఆదాయం ఏటా దాదాపు 8 శాతం పెరిగి రూ.60,698 కోట్లకు చేరుకుంది.

details

వేరియబుల్ పే 100 శాతం చెల్లిస్తామన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

కంపెనీకి భారీగా లాభాలు వచ్చిన సందర్భంగా డివిడెండ్ షేరుపై రూ. 9 చొప్పున ప్రకటించింది. రూ. 17 వేల కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ ను సైతం చేపడతామని వివరించింది. ఈ క్రమంలోనే నికర లాభం భారీగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు వేరియబుల్ పే కు సంబంధించి సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. రెండో త్రైమాసికానికి సంబంధించి కంపెనీ పెర్ఫామెన్స్‌కు లింక్ ఉన్న ఉద్యోగులకు (జూనియర్ ఉద్యోగులు) వేరియబుల్ పే 100 శాతం చెల్లిస్తామని తెలిపింది. అక్టోబర్ 11న ఫలితాల ప్రకటన సందర్భంలోనే దీనిపైనా స్పష్టతనిచ్చింది. సుమారు 70 శాతం మంది ఉద్యోగులు వేరియబుల్ పే అందుకోనున్నారు. మిగతా ఉద్యోగస్తులకు బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ మేరకు వేరియబుల్ పే ఉంటుందని పేర్కొంది.

details

కొత్తగా 40 వేల మంది నియామకం

మరోవైపు FY 2024 రెండో క్వార్టర్​లో TCS​ ఆర్డర్ బుక్​ విలువ 11.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ సీఈఓ, ఎండీ కృతివాసన్​ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో, లాక్ డౌన్ సందర్భంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు పూర్తిగా వర్క్ ఫ్రం హోం అందించాయి. ఆ తర్వాత ఐటీ కంపెనీలకు మూన్ లైటింగ్ భయం పట్టుకుంది. తాజాగా ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని టీసీఎస్ పూర్తిగా ఎత్తేసింది. ఈ నిర్ణయంతో ఇకపై ప్రతీ ఉద్యోగి కచ్చితంగా ఆఫీస్‌కి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో 6,08,985 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 40 వేల మంది ఫ్రెషర్లను నియామకాలకు టీసీఎస్ రూపకల్పన చేస్తోంది.