Loading...
IPO: కళ్లుచెదిరే రిటర్న్స్.. ఏకంగా 111 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.16,700 లాభం..
కళ్లుచెదిరే రిటర్న్స్.. ఏకంగా 111 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.16,700 లాభం..

IPO: కళ్లుచెదిరే రిటర్న్స్.. ఏకంగా 111 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.16,700 లాభం..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 28, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్‌లో ఐపీఓలపై ఇన్వెస్ట్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా పలు ఐపీఓలు అదిరిపోయే లిస్టింగ్ లాభాలను అందిస్తున్నాయి. తాజాగా మరో ఐపీఓ కూడా ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ ఇచ్చింది. గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) అంచనాలను సైతం అధిగమిస్తూ ఏకంగా 111 శాతానికి పైగా ప్రీమియంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఇండియా) లిమిటెడ్ (Tempsens Instruments India Ltd) ఐపీఓ. ఈ కంపెనీ షేరు ఇష్యూ ధర రూ.300గా ఉండగా.. ఎన్ఎస్‌ఈలో రూ.634 వద్ద లిస్టయింది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 111.33 శాతం ప్రీమియంతో లిస్టింగ్ జరిగింది. దీంతో ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజే భారీ లాభం వచ్చింది.

వివరాలు

GMP అంచనాలను మించిన లిస్టింగ్..

టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఐపీఓకు గ్రే మార్కెట్లో కూడా భారీ డిమాండ్ కనిపించింది.

ఐపీఓ లిస్టింగ్‌కు ముందు GMP దాదాపు 100 నుంచి 110 శాతం మధ్య ఉన్నట్లు అంచనాలు వచ్చాయి.

అయితే మార్కెట్లో లిస్టయిన తర్వాత ఈ అంచనాలను మించి 111 శాతానికి పైగా ప్రీమియంతో షేరు ఎంట్రీ ఇచ్చింది.

దీంతో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లు భారీ లాభాలను అందుకున్నారు.

ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఆగస్ట్ 20న ప్రారంభమై.. ఆగస్ట్ 24న ముగిసింది.

కంపెనీ ఒక్కో షేరుకు రూ.285 నుంచి రూ.300 వరకు ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది.

చివరకు అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయిన రూ.300కే షేర్లను కేటాయించింది.

వివరాలు

ఆగస్ట్ 20న ప్రారంభమైన ఐపీఓ..

ఆగస్ట్ 28న స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.

మొత్తం అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఏకంగా 184.07 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.

రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం కూడా 60.69 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.

ADVERTISEMENT

వివరాలు

ఒక్కో లాట్‌పై రూ.16,700 లాభం..

ఈ ఐపీఓలో ఒక లాట్‌లో 50 షేర్లు ఉన్నాయి. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.300గా లెక్కిస్తే.. ఒక లాట్ కొనుగోలు చేయడానికి కనీసం రూ.15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇక లిస్టింగ్ ధర రూ.634గా ఉంది. 50 షేర్లను రూ.634 చొప్పున లెక్కిస్తే వాటి విలువ రూ.31,700 అవుతుంది.

అంటే రూ.15,000 పెట్టుబడిపై లిస్టింగ్ రోజే రూ.16,700 లాభం వచ్చినట్లే.

అయితే ఇది కేవలం లిస్టింగ్ ధర ఆధారంగా లెక్కించిన లాభం మాత్రమే.

షేరు ధర మార్కెట్లో మారుతూ ఉంటుంది కాబట్టి, వాస్తవ లాభం లేదా నష్టం ఆ ధరల ఆధారంగా మారుతుంది.

ADVERTISEMENT

వివరాలు

రూ.650 కోట్ల సమీకరణ లక్ష్యం..

టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఐపీఓ ద్వారా మొత్తం రూ.650 కోట్ల వరకు నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో ఫ్రెష్ ఇష్యూ కింద 31,66,666 కొత్త షేర్లను జారీ చేసి సుమారు రూ.95 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.

అదే సమయంలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద ప్రమోటర్లు 1,85,00,000 షేర్లను విక్రయించారు.

దీని ద్వారా సుమారు రూ.555 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఐపీఓకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కూడా కంపెనీ సుమారు రూ.194.54 కోట్లను సమీకరించింది.

ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించగా.. కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది.

ADVERTISEMENT