LOADING...
Tesla: భారత్‌లో ఫ్యాక్టరీ ప్లాన్‌కు టెస్లా గుడ్‌బై.. ఇక షోరూమ్‌లపైనే ఫోకస్
భారత్‌లో ఫ్యాక్టరీ ప్లాన్‌కు టెస్లా గుడ్‌బై.. ఇక షోరూమ్‌లపైనే ఫోకస్

Tesla: భారత్‌లో ఫ్యాక్టరీ ప్లాన్‌కు టెస్లా గుడ్‌బై.. ఇక షోరూమ్‌లపైనే ఫోకస్

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఈవీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి H. D. Kumaraswamy ధృవీకరించినట్లు విదేశీ మీడియా వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో స్థానికంగా కార్ల తయారీపై టెస్లా ఆసక్తి చూపినా.. దిగుమతి సుంకాల్లో రాయితీలు,ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రంతో సరైన ఒప్పందం కుదరకపోవడంతో చివరకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇకపై భారత్‌లో తయారీ కంటే రిటైల్ వ్యాపారంపైనే టెస్లా దృష్టి పెట్టనుంది. గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత కంపెనీ షోరూమ్‌ల విస్తరణను వేగవంతం చేసింది.

వివరాలు 

విదేశాల్లో తయారైన ఈవీలపై భారత్‌లో 110 శాతం వరకు దిగుమతి సుంకం

ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో టెస్లా షోరూమ్‌లు పనిచేస్తున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో సూపర్‌చార్జర్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. టెస్లా ప్రస్తుతం చైనాలోని గిగా షాంఘై ప్లాంట్ నుంచి Tesla Model Y, Tesla Model YL కార్లను భారత్‌కు దిగుమతి చేస్తోంది. అయితే విదేశాల్లో తయారైన ఈవీలపై భారత్‌లో 110 శాతం వరకు దిగుమతి సుంకం ఉండటంతో కార్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో స్థానిక కంపెనీలతో పోలిస్తే టెస్లా కార్లు మరింత ఖరీదుగా మారి అమ్మకాలపై ప్రభావం పడుతోంది. 2025లో ఇప్పటివరకు కేవలం 225 కార్లు మాత్రమే డెలివరీ అయినట్లు సమాచారం. దిగుమతి సుంకాలను తగ్గించేందుకు భారత్ ప్రభుత్వం ప్రత్యేక ఈవీ విధానాన్ని తీసుకొచ్చింది.

వివరాలు 

నిబంధనలపై టెస్లా,భారత అధికారుల మధ్య విభేదాలు

35వేల డాలర్లకు పైబడిన ఈవీలపై సుంకాన్ని 15శాతానికి తగ్గించే అవకాశం ఇచ్చింది. అయితే ఇందుకోసం కనీసం 500మిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని షరతు పెట్టింది. ఈ నిబంధనలపై టెస్లా,భారత అధికారుల మధ్య విభేదాలు తలెత్తడంతో కంపెనీ ఆ ప్రణాళికల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక భారత ఆటోమొబైల్ సరఫరా వ్యవస్థలో లోపాలు,మౌలిక వసతుల కొరత, నియంత్రణలపై స్పష్టత లేకపోవడం,టెస్లా ప్రీమియం ధరలకు భారత వినియోగదారుల కొనుగోలు శక్తి సరిపోకపోవడం వంటి అంశాలు కూడా కంపెనీ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ భారత మార్కెట్‌ను పూర్తిగా వదిలేయకుండా ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణపై టెస్లా దృష్టి కొనసాగిస్తోంది. ఇటీవల బెంగళూరులో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది.

Advertisement