Tesla: ముంబై షోరూమ్ కోసం టెస్లా నెలకు ఎంత అద్దె చెల్లిస్తుందో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా (Tesla) భారత మార్కెట్‌లోకి ప్రవేశించనున్న విషయం తెలిసిందే.
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజమైన ఈ సంస్థ, తన తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai Showroom) ప్రారంభించనుంది.
ఇందుకోసం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి.
వివరాలు
అద్దె వివరాలు
సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ సమాచారం ప్రకారం, ఈ షోరూమ్ కోసం పార్కింగ్ సౌకర్యాలతో కూడిన ప్రదేశాన్ని టెస్లా నెలకు రూ.35 లక్షల అద్దె (Monthly Rent) చెల్లించనుంది.
అద్దెకు సంబంధించి ఏడాదికి 5% పెరుగుదలతో, ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజు తీసుకుంది.
ఈ ప్రాంగణం దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన యాపిల్ స్టోర్‌కు సమీపంలో ఉంది.
రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. టెస్లా రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా చెల్లించింది.
వివరాలు
భారత మార్కెట్‌లో టెస్లా ఎంట్రీ
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
అయితే, భారత ప్రభుత్వం విధిస్తున్న దిగుమతి సుంకాలు టెస్లా కోసం ప్రధాన అవరోధంగా మారాయని సంస్థ గతంలో వెల్లడించింది.
అయితే, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో (Elon Musk) సమావేశమయ్యారు.
ఈ భేటీలో వాణిజ్య సంబంధిత అంశాలతో పాటు, టెస్లా భారత్‌లోకి ప్రవేశానికి సంబంధించిన ముఖ్య విషయాలు కూడా చర్చించారు. మోదీతో భేటీ అనంతరం, టెస్లా తన వ్యూహాలను వేగవంతం చేయడం విశేషం.
వివరాలు
భారతదేశంలో టెస్లా షోరూమ్‌లు.. నియామకాలు
టెస్లా తన తొలి రెండు షోరూమ్‌లను దేశ రాజధాని ఢిల్లీ,ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో ఏర్పాటు చేయనుంది.
దీనితోపాటు, భారతదేశంలో ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా ప్రారంభించింది .
ఈ మేరకు, కస్టమర్ రిలేటెడ్, బ్యాక్‌ఎండ్ జాబ్స్ సహా 13 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యంగా, సర్వీస్ టెక్నీషియన్, సలహాదారు (Advisor) వంటి ఉద్యోగాలకు ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతోంది.
మిగిలిన పోస్టులకు అభ్యర్థులను ప్రధానంగా ముంబై కేంద్రంగా నియమించనున్నట్లు సంస్థ వెల్లడించింది.