
Tax Collected at Source: లగ్జరీ వస్తువులపై కేంద్రం కొత్త ట్యాక్స్.. రూ.10 లక్షలకు పైగా అంటే 1శాతం టీసీఎస్!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం లగ్జరీ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన హైఎండ్ వస్తువుల విక్రయాలపై 1 శాతం టీసీఎస్ (Tax Collected at Source) విధించాలని నిర్ణయించింది.
ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ బుధవారం ప్రకటించింది.
ఇందులో భాగంగా పెయింటింగ్స్, శిల్పాలు, సన్‌గ్లాసెస్, హ్యాండ్‌బ్యాగ్స్, పాదరక్షలు, హోం థియేటర్ సిస్టమ్స్, రేసింగ్ గుర్రాలు, హైఎండ్ స్పోర్ట్స్‌వేర్, క్రీడా పరికరాలు, చేతి గడియారాల వంటి లగ్జరీ వస్తువులపై టీసీఎస్ వర్తిస్తుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
Details
అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరి
ఈ చర్యతో అధిక విలువ గల వస్తువుల లావాదేవీల్లో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ఇకపై టీసీఎస్ ప్రక్రియను విక్రయదారులు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
కస్టమర్లు లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తమ KYC వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్యతో లగ్జరీ గూడ్స్ విక్రయాలపై పర్యవేక్షణ పెరిగి, నిబంధనలు మరింత కట్టుదిట్టంగా అమలవుతాయని భావిస్తున్నారు.