కోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా తాజాగా 3శాతం వాటాను విక్రయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ తాజాగా వెల్లడించింది. వాటాను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.4,185 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిన కోల్ ఇండియా తన వాటాను విక్రయించింది. 3శాతం వాటాను విక్రయించడం ద్వారా కోల్ ఇండియాలో ప్రభుత్వ వాటా 63.13 శాతానికి తగ్గిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సీఐఎల్ తెలిపింది.
ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.51,000 కోట్లు
కేంద్ర ప్రభుత్వం గత వారమే కోల్ ఇండియాలో మూడు శాతం వాటాను విక్రయించింది. ఇష్యూ రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులతో ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పీఎస్‌యూ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.4,235 కోట్లను సమీకరించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పూర్తి సంవత్సర లక్ష్యం రూ.51,000 కోట్లుగా నిర్ణయించబడింది. ఎల్‌ఐసీలో కూడా మరికొంత వాటాను విక్రయించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అది ఎంతశాతం అనేది తెలియాల్సి ఉంది.