
త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ తొలి ఐఫోన్ తయారీ సంస్థగా అవతరించేందుకు టాటా గ్రూప్ అడుగు దూరంలోనే ఉంది.
తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం విస్ట్రాన్ ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
రెండు సంస్థల మధ్య ఒప్పందం ఆగస్టులో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పూర్తయితే ఐఫోన్‌లను తయారు చేసే మొదటి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది.
విస్ట్రాన్‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేయడం అనేది భారతదేశ ఆకాంక్షలకు ఇది ఒక ప్రధాన ప్రోత్సాహం అని చెప్పాలి.
ఐఫోన్‌లను తయారు చేసే భారతీయ కంపెనీ ఉండటం వల్ల, ఇతర ప్రధాన కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనుంది.
టాటా
బెంగళూరు శివార్లలో విస్ట్రోన్ ప్లాంట్
విస్ట్రోన్‌కు సంబంధించిన ఐఫోన్ ఫ్యాక్టరీ కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉంది.
ఫ్యాక్టరీ విలువ 600 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ డీల్ కోసం టాటా, విస్ట్రాన్ సుమారు ఒక సంవత్సరం కాలంగా చర్చలు జపుతున్నాయి.
ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. విస్ట్రోన్ ప్లాంట్‌ను కొనుగోలు తర్వాత ఆర్థిక సంవత్సరంలో కనీసం 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను రవాణా చేయాలన్న విస్ట్రాన్ తాము పూర్తిచేస్తామని టాటా గ్రూప్ చెబుతోంది.
ప్రస్తుతం విస్ట్రోన్ సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సంస్థ లాభాలను గడించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టింది.
టాటా
2017 నుంచి భారతదేశంలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్న విస్ట్రాన్
ఐఫోన్‌ల తయారీ వ్యాపారంలోకి రావడం టాటా గ్రూప్‌కి సువర్ణావకాశమని చెప్పాలి. ప్రస్తుతం టాటా గ్రూప్ ఉత్పత్తి చేయని కొన్నింటిలో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ విభాగంలోకి కూడా టాటా గ్రూప్ అడుగుపెడుతోంది.
ఐఫోన్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి టాటా గ్రూప్ ప్రవేశించడం అనేది మంచి పరిణామంగా భావించాలి. టాటా ఇప్పటికే ఐఫోన్ ఛాసిస్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
విస్ట్రాన్ 2017లో భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించింది. జూన్ 30న ముగిసిన మొదటి త్రైమాసికంలో విస్ట్రాన్ సంస్థ భారతదేశం నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది.