IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా
2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటులో భారత్ స్థిరమైన వేగాన్ని కొనసాగిస్తుందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ప్రపంచ దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పింది. ఫలితంగా భారత వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్నాయని వివరించింది. దీని కారణంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఐఎంఎఫ్ చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది కీలక పాత్ర అని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే భారత్‌ను ఐఎంఎఫ్ స్టార్ పెర్ఫార్మర్‌గా అభివర్ణించిండం గమనార్హం.
ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుంది: ఐఎంఎఫ్
గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ భారత మిషన్ నాదా చౌయిరీ అన్నారు. ఇతర దేశాలతో వృద్ధితో పోల్చి చూస్తే.. భారత్ స్టార్ పెర్ఫార్మర్‌గా అవతరించిందన్నారు. భారత్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెద్దదని వివరించారు. ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగూనంగా తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆహార ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం అస్థిరంగా ఉందని చెప్పింది. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 4.87శాతం నుంచి 5.55శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని 4శాతానికి లక్ష్యానికి తీసుకురావడానికి ఆర్‌బీఐ ప్రస్తుత తటస్థ ద్రవ్య విధాన వైఖరిని కొనసాగించాలని నిర్ణయించడాన్ని ఐఎంఎఫ్ స్వాగతించింది.