LOADING...
March 2026 New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే
వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే

March 2026 New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి నెల ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ - పాన్ కార్డ్ నిబంధనలు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోవడం సాధారణమే. ఇప్పుడు ఫిబ్రవరి 2026 ముగింపు దశకు చేరుకోగా, మరికొన్ని రోజుల్లో మార్చి నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరల నుంచి యూపీఐ సేవల వరకు పలు కీలక మార్పులు మార్చి నెలలో అమల్లోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

వివరాలు 

గ్యాస్ సిలిండర్ ధరలు:

చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించి సవరిస్తాయి. అందువల్ల ప్రతినెలా ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి. ఫిబ్రవరి 2026లో వాణిజ్య వినియోగ సిలిండర్ల ధరలను భారీగా పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి నెలలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్‌ఓలో కొత్త విధానం: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల నుంచి కట్ అయ్యే పీఎఫ్ మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి నిర్దిష్ట విధానం అమల్లో ఉండగా, మార్చి 2026 నుంచి కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.

వివరాలు 

యూటీఎస్ యాప్ సేవలు నిలిపివేత:

ఇకపై ఏటీఎంలు,యూపీఐ యాప్‌ల ద్వారా కూడా పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నారు. భారతదేశంలో రైలు ప్రయాణం ప్రజలకు అత్యంత ముఖ్యమైన రవాణా సౌకర్యం. ప్రస్తుతం ప్రయాణికులు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే UTS యాప్‌ను మార్చి 1, 2026 నుంచి నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. దాని స్థానంలో 'రైల్ వన్' యాప్‌ను ఉపయోగంలోకి తీసుకురానున్నారు.

Advertisement

వివరాలు 

పాన్-ఆధార్ లింకింగ్‌పై కఠిన నిబంధనలు:

మార్చి 2026 నుంచి పాన్ కార్డులకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినంగా అమలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించనుంది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని పక్షంలో ఆ పాన్ కార్డు నిలిపివేయబడే అవకాశం ఉంది. దీని ప్రభావం బ్యాంకింగ్ లావాదేవీలు, పెట్టుబడులు,ఇతర ఆర్థిక కార్యకలాపాలపై పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రతి వ్యక్తి గుర్తింపును ఒకే పాన్ మరియు ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement