
Investment Tips: ఫస్ట్ టైం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకుంటే ఇక సమస్య ఉండదు
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. చాలా మంది డబ్బును బ్యాంక్ ఖాతాల్లో ఉంచడం కన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం ప్రారంభించారు. డబ్బును కేవలం సేవింగ్స్‌లోనే నిల్వ చేయడం కంటే, ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఎక్కువ లాభాలు రావచ్చని అనేక ఫైనాన్షియల్ అడ్వైజర్లు సిఫార్సు చేస్తున్నారు. అయితే, కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి కొన్ని సాధారణ సందేహాలు ఉంటాయి. వాటిని క్లియర్ చేయడం అవసరం.
#1
ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్
ఇన్వెస్ట్‌మెంట్స్‌ను చిరకాల లక్ష్యంతో చేయాలి. ఒక్కసారిగా పెట్టిన తర్వాత, వాటి పెరుగుదల లేదా తగ్గుదల గురించి తరచూ ఆందోళన చెందడం అవసరం లేదు. నిపుణులు చెప్పినట్లుగా, నాలుగు నుంచి ఐదు సంవత్సరాల తరువాతే నిజమైన లాభాలు కనిపిస్తాయి. ఒక ఫండ్ విలువ పెరిగిందా, తగ్గిందా అని తరచుగా పరిశీలించడం మంచిది కాదు. మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి, కాబట్టి భయము లేకుండా పెట్టే వ్యక్తులకే ఇన్వెస్ట్‌మెంట్ సరిగా ఉంటుంది.
#2
స్టాక్స్ లెక్క వేరు
మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఎంచుకున్న కంపెనీ పనితీరును గమనించి పెట్టుబడి పెట్టాలి. స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాటిని తరచూ పరిశీలించాలి. ఎంచుకున్న కంపెనీ ఆర్ధిక స్థితి, దివాలా అయ్యే అవకాశాలు వంటి అంశాలను బాగా అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లాగా స్టాక్స్‌లోనూ కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు.
#3
బ్యాలెన్స్‌డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్..
మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్‌లో పెట్టేముందు, వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను పూర్తిగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ ప్రాధాన్యతలు, లక్ష్యాలు, రిస్క్ సహన సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. రిస్క్,సేఫ్టీని సమతుల్యంగా కాపాడుతూ పెట్టుబడులు చేయడానికి ఉన్న విధానాల గురించి కూడా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.