LOADING...
EMI: ఇల్లు కొనాలనుకుంటే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. 5x వార్షిక ఆదాయ నియమాన్ని తెలుసుకోండి!
ఇల్లు కొనాలనుకుంటే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. 5x వార్షిక ఆదాయ నియమాన్ని తెలుసుకోండి!

EMI: ఇల్లు కొనాలనుకుంటే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. 5x వార్షిక ఆదాయ నియమాన్ని తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలామందికి తమ తొలి ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం జీవితంలో ఒక పెద్ద మైలురాయి. ఆ కల నెరవేరినప్పుడు వారి కళ్లలో కనిపించే సంతోషానికి కొలమానం ఉండదు. అయితే ఇల్లు కొనడం ఒక భావోద్వేగ నిర్ణయం మాత్రమే కాదు — ఇది జీవితాంతం ప్రభావం చూపే ఆర్థిక నిర్ణయం కూడా. ముఖ్యంగా ఈ రోజుల్లో నగరాల్లో చాలామంది తమ సొంతింటి కోసమే హోమ్‌ లోన్స్‌పై ఆధారపడుతున్నారు. నెలనెలా EMI భరించగలమని భావించి లక్షల్లో రుణాలు తీసుకుంటున్నారు. అయితే సరైన ప్రణాళిక లేకుండా లోన్‌ తీసుకుంటే EMI అనే ఒత్తిడిలో చిక్కుకునే ప్రమాదం ఎక్కువ. ఆ ఉచ్చులో పడకుండా ఉండాలంటే ముందుగానే తెలివిగా ఆలోచించాలి.

Details

5X రూల్‌ను తప్పక గుర్తుపెట్టుకోండి

మొదటిసారి హోమ్‌ లోన్ తీసుకునేవారు 5Xవార్షిక ఆదాయం నియమం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే కొనుగోలు చేసే ఆస్తి విలువ మీ ఇంటి వార్షిక ఆదాయం కంటే ఐదు రెట్లు మించకూడదు. దానికంటే ఎక్కువ ఉన్న ఆస్తి కొనుగోలు చేస్తే ప్రారంభంలో పెద్దగా కష్టంగా అనిపించకపోయినా, తిరిగి చెల్లించే వ్యవధిలో భారీ ఒత్తిడిని సృష్టిస్తుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ రిస్క్‌ మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఫ్లాట్‌ లేదా ఇంటి ధర అనేది మొత్తం ఖర్చులో ఒక భాగమే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, నిర్మాణంలో ఉన్న ఆస్తులపై GST, ప్రాథమిక ఇంటీరియర్స్, నిర్వహణ డిపాజిట్లు, బీమా ప్రీమియం వంటి ఖర్చులు కలిసి మొత్తం బిల్లుకు మరో 8-10%అదనంగా జతవుతాయి.

Details

EMI ట్రాప్‌ — తొలి కొనుగోలుదారులు ఎక్కువగా చేసే తప్పు

ఇవన్నీ ముందుగానే లెక్కలో పెట్టకపోతే రుణం మంజూరు తర్వాతే అసలు ఆర్థిక ఒత్తిడి మొదలవుతుంది. మొదటిసారి ఇల్లు కొనేవారు సాధారణంగా పడే పెద్ద ఉచ్చు ఓవర్-లివరేజ్. బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఆదాయాన్ని బట్టి ఎక్కువ రుణ అర్హత చూపించినప్పటికీ, నెలవారీ EMI మాత్రం మీ గృహ బడ్జెట్‌ను మించకూడదు. EMI మొత్తం నెలవారీ ఆదాయంలో 40-45% లోపే ఉండటం ఉత్తమం. ఈ పరిధి మీకు ఆర్థికంగా సరైన శ్వాసనిస్తుంది. అదనంగా స్టెప్-అప్ EMIలు, పార్ట్-ప్రీపేమెంట్ వంటి రిపేమెంట్ ఆప్షన్లు గృహ రుణ బరువును మరింత సౌకర్యవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి. సరైన EMI ప్లానింగ్ ఉంటే, హోమ్‌లోన్ బరువు జీవితాన్ని కాకుండా, మీ సొంతింటి ఆనందాన్ని మాత్రమే పెంచుతుంది.