LOADING...
Job Offer: క్రేజీ జాబ్ ఆఫర్‌.. ఫ్రీ ఇల్లు, భోజనం తో పాటు గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్!
క్రేజీ జాబ్ ఆఫర్‌.. ఫ్రీ ఇల్లు, భోజనం తో పాటు గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్!

Job Offer: క్రేజీ జాబ్ ఆఫర్‌.. ఫ్రీ ఇల్లు, భోజనం తో పాటు గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI స్టార్టప్ 'క్లూలే' ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్టప్ ఫౌండింగ్ ఇంజనీర్ పోస్టుకు భారీ జీతం మాత్రమే కాకుండా ఫ్రీగా ఇల్లు, భోజనం అందిస్తామని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం మరింత సంచలనం సృష్టించింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి సంవత్సరానికి సుమారు రూ.2.33 కోట్ల నుంచి రూ.3.26 కోట్ల వరకు జీతం, అదనంగా ఈక్విటీ షేర్ కూడా ఇస్తామని తెలిపింది.

వివరాలు 

గతంలో కూడా క్రేజీ ఆఫర్ ఇచ్చిన కంపెనీ 

అయితే వారానికి 6 రోజులు, రోజుకు 10-12 గంటలు పని చేయాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కొత్త ప్రయోగాలకు ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి అవకాశం కావొచ్చని చెబుతున్నారు. ఇదే కంపెనీ గతంలో ఉద్యోగులకు డేటింగ్ పార్ట్నర్ కనుక్కుంటే డబ్బు ఇస్తామని ప్రకటించి కూడా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ ఆఫర్‌తో మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

Advertisement