LOADING...
Warren Buffett: ఇది నా చివరి లేఖ.. వారెన్ బఫెట్ భావోద్వేగ ప్రకటన
ఇది నా చివరి లేఖ.. వారెన్ బఫెట్ భావోద్వేగ ప్రకటన

Warren Buffett: ఇది నా చివరి లేఖ.. వారెన్ బఫెట్ భావోద్వేగ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, బర్క్‌షైర్‌ హాతవే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) తన లెజెండరీ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇకపై వార్షిక షేర్‌హోల్డర్‌ లేఖలు రాయకూడదని, ప్రజా వేదికలపై మాట్లాడడాన్ని కూడా ఆపుతున్నానని ఆయన ప్రకటించారు. దీంతో ప్రపంచ ఆర్థిక రంగంలో ఓ మహానుభావ యుగం ముగిసినట్టయింది. 95 ఏళ్ల బఫెట్‌ సోమవారం విడుదల చేసిన తన చివరి థ్యాంక్స్‌గివింగ్‌ లేఖలో కీలక విషయాలను వెల్లడించారు. ఇకపై బర్క్‌షైర్‌ వార్షిక నివేదికలను తానే రాయకుండా, సమావేశాల్లో 'ఎండ్లెస్‌గా మాట్లాడటం' మానేస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి నేను 'గోయింగ్‌ క్వయెట్‌'.. అంటే కాస్త మౌనంగా ఉంటానని ఆయన ఆత్మీయంగా రాశారు.

Details

కుటుంబ ఫౌండేషన్లకు భారీ విరాళం

బఫెట్‌ తనకు చెందిన $1.3 బిలియన్‌ (సుమారు ₹10,000 కోట్లు) విలువైన షేర్లను దానం చేశారు. ఈ విరాళాలను తన కుటుంబంలోని నాలుగు ట్రస్టులకు Susan Thompson Buffett Foundation, Sherwood Foundation, Howard G. Buffett Foundation, NoVo Foundation కి అందజేశారు. ఆరోగ్యం బాగానే ఉన్నా.. వయసు ప్రభావం తప్పదని బఫెట్‌ వ్యాఖ్య తాను వృద్ధుడైనా మానసికంగా సానుకూలంగానే ఉన్నానని బఫెట్‌ తెలిపారు. సమతుల్యత, చూపు, వినికిడి, జ్ఞాపకశక్తి కొంత తగ్గినా.. నేను ఇప్పటికీ వారంలో ఐదు రోజులు ఆఫీసుకే వస్తాను. అద్భుతమైన సిబ్బందితో పనిచేస్తున్నానని ఆయన రాశారు.

Details

వారసుడిపై నమ్మకం

తన వారసుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కుమారుడు అబెల్‌ (Abel) పట్ల పూర్తి నమ్మకం ఉందని బఫెట్‌ తెలిపారు. అతను గొప్ప మేనేజర్‌, అలసట తెలియని వర్కర్‌, నిజాయితీ గల వ్యక్తి. అతని ఆరోగ్యం ఇంకా ఎన్నో దశాబ్దాలు చక్కగా ఉండాలని ఆశిస్తున్నాను. వచ్చే 100 ఏళ్లలో బర్క్‌షైర్‌కి ఐదుగురు లేదా ఆరుగురు సీఎఈవోలు చాలు అని అన్నారు. 'ఓమాహా' పట్ల కృతజ్ఞత తాను పుట్టి పెరిగిన 'ఓమాహా నగరానికి' బఫెట్‌ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. బర్క్‌షైర్‌, నేను ఇతరచోట ఉంటే అంత విజయం సాధించేవాళ్లమో కాదేమో. అమెరికా మధ్యభాగం జీవనానికి, కుటుంబానికి, వ్యాపారానికి అద్భుతమైన ప్రదేశమన్నారు. అలాగే 64 ఏళ్లుగా తన స్నేహితుడు చార్లీ మంగర్‌తో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Details

తప్పులు నుంచి నేర్చుకోవాలి

తప్పులు చేయడంలో తప్పులేదు, వాటి నుంచి నేర్చుకోండి. సద్గుణాలను అనుసరించండి. మీరు మీ మరణవార్తలో ఎలా గుర్తుండాలనుకుంటారో, ఆ విధంగానే జీవించండి. సంపద, ప్రచారం లేదా అధికారమే గొప్పతనం కాదు — ఎవరికైనా సహాయం చేయడం, దయ చూపడం నిజమైన మహత్తు. దయకి ఖర్చు లేదు కానీ విలువ అపారమైనదని బఫెట్‌ పేర్కొన్నారు. తాను ఎన్నో తప్పులు చేసినా, మంచి స్నేహితుల సహవాసం వల్ల మానవత్వం నేర్చుకున్నానని అన్నారు. "చీఫ్‌ అయినా, క్లీనింగ్‌ లేడీ అయినా.. ఇద్దరూ మనుషులే అన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని తన చివరి మాటలతో ముగించారు.