
Sugar stocks: 11% పెరిగిన షుగర్ స్టాక్స్.. కారణం ఏంటంటే!
ఈ వార్తాకథనం ఏంటి
షుగర్ కంపెనీల స్టాక్స్ సోమవారం భారీగా వృద్ధి చెందాయి. దాదాపు 11శాతం పెరిగి.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసాన్ని ఉపయోగించడంపై భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెనక్కి వెనక్కితీసుకోవడమే షుగర్ స్టాక్స్ భారీ ర్యాలీ అవడానికి కారణం.
2023-24 సరఫరా సంవత్సరానికి పర్యావరణ అనుకూల ఇంధనాన్ని రూపొందించడంలో చెరకు రసం, B-హెవీ మొలాసిస్ రెండింటినీ ఉపయోగించడానికి కేంద్రం అనుమతినిచ్చింది.
ఫలితంగా ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్, ఇండియన్ సుక్రోజ్, బజాజ్ హిందుస్థాన్ షుగర్ వంటి చక్కెర కంపెనీల షేర్లు 10% పైగా పెరిగాయి.
షుగర్
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చక్కెర ఉత్పత్తికి ఊతం
బలరాంపూర్ చినీ మిల్స్, శ్రీ రేణుకా షుగర్స్ దాదాపు 7.5శాతం లాభపడగా, దాల్మియా భారత్ షుగర్ సుమారు 6.5శాతం పెరిగింది.
ద్వారికేష్ షుగర్ 6.39 శాతం పెరిగి రూ. 91.38, ఇండియన్ సుక్రోజ్ 10.65% పెరిగి రూ. 90, త్రివేణి ఇంజినీరింగ్, EID-ప్యారీ (ఇండియా) దాదాపు 5% చొప్పున లాభపడ్డాయి.
బజాజ్ హిందుస్థాన్ షుగర్ 9.22 శాతం పెరిగి రూ. 30.55 వద్ద, ధంపూర్ చక్కెర మిల్స్ 8.22 శాతం పెరిగి రూ. 268.45, మగద్ షుగర్ & ఎనర్జీ 6.56% పెరిగి రూ. 724.30 వద్ద స్థిరపడింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చక్కెర ఉత్పత్తికి ఊతమిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.