Personal Loan నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసినా.. ఇలా చేస్తే పొందడం చాలా సులభం
ఈ వార్తాకథనం ఏంటి
రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో Personal Loans పొందడం కష్టంగా మారింది.
హామీలు లేని రుణాల రిస్క్ వెయిట్‌ను ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో వ్యక్తిగత రుణాలు ఇది వరకు తీసుకున్నంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీని ప్రభావం క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లను ఈఎంఐ రూపంలోకి మార్చుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయిని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో అసలు వ్యక్తిగత రుణాలను పొందలేమా? అనే అనుమానం వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. వ్యక్తిగత రుణం తీసుకోవడం సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
రుణం
మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికే లోన్లు
ఆర్‌బీఐ విధించిన కఠిన నిబంధనల దృష్య్టా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ మంజూరులో చాలా జాగ్రత్తగా వ్యవహరించనున్నాయి.
అందుకే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నమ్మకమైన కస్టమర్లు, మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికే లోన్లు ఇచ్చే ఆలోచనను పరిశీలిస్తున్నాయి.
లోన్ కావాలనుకునే వారు క్రెడిట్ కార్డు యుటిలైజేషన్ రేషియో 30 శాతం దాటకుండా చూసుకోవాలి.
అలాగే వ్యక్తిగత రుణం తీసుకోకుండా.. క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే.. బ్యాంకులకు నమ్మకాన్ని కలిగించినట్లు అయితే మరోసారి లోల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ 750 తగ్గకుండా చూసుకోవాలి. అలా అయితే రుణం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తక్కువ సమయంలో ఎక్కువ లోన్ దరఖాస్తును చేసుకోవద్దు. ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.