LOADING...
TMPLV: రూ.76,248 కోట్ల లాభంతో టీఎమ్‌పీవీఎల్‌ రికార్డ్‌ బ్రేక్‌ 
రూ.76,248 కోట్ల లాభంతో టీఎమ్‌పీవీఎల్‌ రికార్డ్‌ బ్రేక్

TMPLV: రూ.76,248 కోట్ల లాభంతో టీఎమ్‌పీవీఎల్‌ రికార్డ్‌ బ్రేక్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (TMPLV) ఏకీకృత ఆర్థిక నివేదికల ప్రకారం, కంపెనీ సెప్టెంబరు త్రైమాసికానికి గాను రూ.76,248 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,521 కోట్లు మాత్రమే. ఈ భారీ లాభానికి ప్రధాన కారణం బ్రిటిష్‌ అనుబంధ సంస్థ 'జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌' (JLR) కార్యకలాపాలు సైబర్‌ దాడి నేపథ్యంలో నిలిచిపోవడం అని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. జేఎల్‌ఆర్‌ కార్యకలాపాల నిలిపివేత వల్ల రూ.82,600 కోట్ల భారీ లాభం లెక్కల్లో చేరింది. అలాగే వాణిజ్య వాహనాల వ్యాపార విభజన, బదిలీ ద్వారా వచ్చిన లాభం కూడా ఇందులో భాగమే. అయితే మొత్తం ఆదాయం మాత్రం తగ్గింది.

Details

జేఎల్‌ఆర్‌ ఆదాయంలో భారీ తగ్గుదల 

కార్యకలాపాల ద్వారా వచ్చిన సమగ్ర ఆదాయం గతేడాది రూ.83,656 కోట్లు ఉండగా, ఈసారి అది రూ.72,349 కోట్లకు పడిపోయింది. సైబర్‌ దాడుల ప్రభావంతో జేఎల్‌ఆర్‌ ఆదాయం 24.3% తగ్గి, కేవలం 4.9 బిలియన్‌ పౌండ్లకు (దాదాపు రూ.57,200 కోట్లు) చేరింది. ఈ నేపథ్యంలో సంస్థ EBIT మార్జిన్‌ -8.6%గా నమోదైంది. ప్యాసింజర్‌ వాహనాల వ్యాపారానికి మంచి వృద్ధి టాటా ప్యాసింజర్‌ వాహనాల (PV) విభాగం మాత్రం మంచి వృద్ధిని సాధించింది. ఈ విభాగ ఆదాయం 15.6% పెరిగి రూ.13,500 కోట్లకు చేరుకుంది. ప్యాసింజర్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 10.8% వృద్ధితో మొత్తం 1,44,500 యూనిట్లకు చేరాయి.

Details

వినియోగదారుల డేటా లీక్‌ పై ఆందోళన

సైబర్‌ దాడులతో జేఎల్‌ఆర్‌ వినియోగదారుల వివరాలు బహిర్గతం అయ్యే ప్రమాదం ఉందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించినట్లు టాటా మోటార్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ పీ.బీ. బాలాజీ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సైబర్‌ దాడుల కారణంగా జేఎల్‌ఆర్‌ అనేక ప్లాంట్లలో తయారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.