
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది
ఈ వార్తాకథనం ఏంటి
గోల్డ్ లవర్స్ కి శుభవార్త..! బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ మధ్య పెరిగిన రేట్లతో కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేసిన వినియోగదారులకు ఇది ఊరట కలిగించే విషయం.
పసిడి ధరలు తగ్గుతుండటంతో గోల్డ్ లవర్స్ ఆనందంలో మునిగిపోయారు.
ఈ రోజు బంగారం ధరలు మామూలు తగ్గుదల కాకుండా భారీగా పడిపోయాయి. ఒక తులం బంగారం ధర నేరుగా రూ. 650 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర (గ్రాము)రూ. 8,973,22 క్యారెట్ల బంగారం ధర (గ్రాము) రూ. 8,225గా ఉంది
వివరాలు
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం,22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ. 82,250కి చేరింది.
అలాగే,24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.89,730కి చేరింది.విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో,22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.82,400, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 89,880గా ట్రేడ్ అవుతోంది.
ఇదిలా ఉండగా, బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 1,03,000 వద్ద ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 94,000కి చేరింది.