Top 10 IPOsin 2026: 2026లో భారత IPOల సునామీ..పెట్టుబడి వ్యూహాలను ముందే సిద్ధం చేసుకొండి
ఈ వార్తాకథనం ఏంటి
2025లో భారతీయ స్టాక్ మార్కెట్ ఎన్నో రికార్డు బ్రేకింగ్ ఐపీఓలను చూసింది. కానీ అసలు హాట్‌స్టార్ట్ వేడుక 2026లో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. సుమారు రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు 190కి పైగా కంపెనీలు క్యూ కడుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, సెబీ ఇప్పటికే 84 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, 100కి పైగా కంపెనీలు అనుమతుల కోసం వేచి ఉన్నాయి. వచ్చే ఏడాది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించబోతున్న టాప్ 10 ఐపీఓలను ఇక్కడ పరిశీలిద్దాం.
వివరాలు
2026లో రాబోయే టాప్ 10.. IPOలు..
రిలయన్స్ జియో (Reliance Jio IPO): భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా రాబోతోంది. సుమారు 170 బిలియన్ డాలర్ల విలువతో 2026 మొదటి సగభాగంలోనే లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని ముకేశ్ అంబానీ సంకేతాలు ఇచ్చారు. ఎన్ఎస్ఈ (NSE IPO): చాలా కాలంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓ, ఎట్టకేలకు 2026లో మార్కెట్‌లోకి రాబోతుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో దీని షేర్లు సుమారు రూ. 1,950 వద్ద ట్రేడవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ (Flipkart IPO): ఈ ఇ-కామర్స్ దిగ్గజం కూడా త్వరలో పబ్లిక్ లిస్టింగ్ కోసం సిద్ధమవుతోంది. ఫోన్ పే (PhonePe IPO): బెంగళూరుకు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ సుమారు రూ. 12,000 కోట్ల రేకింగ్ లక్ష్యంతో IPOకి సిద్ధమవుతోంది.
వివరాలు
2026లో రాబోయే టాప్ 10.. IPOలు..
జెప్టో (Zepto IPO): క్విక్ కామర్స్ రంగంలో వేగంగా పెరుగుతున్న జెప్టో సుమారు $500 మిలియన్ల IPOతో మార్కెట్లోకి రానుంది. ఓయో (Oyo IPO): హాస్పిటాలిటీ ఫీల్డ్‌లో ప్రముఖమైన ఈ సంస్థ, సుమారు 7-8 బిలియన్ డాలర్ల వ్యాల్యూను అందుకుంటూ IPOకి సిద్ధమవుతోంది. బోట్ (boAt IPO): ఆడియో, వేర్‌బుల్స్ రంగంలో పేరున్న 'ఇమాజిన్ మార్కెటింగ్' కంపెనీ రూ. 1,500 కోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందింది. హీరో ఫిన్‌కార్ప్ (Hero FinCorp IPO): సుమారు రూ. 3,600కోట్లతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో బలమైన ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI Mutual Fund IPO): ఎస్బీఐ గ్రూప్ నుంచి వచ్చే ఈ భారీ IPOపై ఇన్వెస్టర్లలో భారీ అంచనాలు ఉన్నాయి.
వివరాలు
ఎందుకు ఈ దూకుడు?
కార్ దేఖో (CarDekho IPO): కొంతకాలం వాయిదా పడినప్పటికీ, 2026లో ఆటో-టెక్ కంపెనీ లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైమ్ సెక్యూరిటీస్ నివేదికల ప్రకారం, భారత ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు అత్యంత సమర్థవంతంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే స్థాయికి చేరుకుంది. రెగ్యులేటరీ సంస్కరణలు,డిజిటల్ ఎకానమీ వృద్ధి కారణంగా కొత్త టెక్నాలజీ స్టార్టప్‌ల నుంచి పాత దిగ్గజ కంపెనీల వరకు అందరూ పబ్లిక్ మార్కెట్ వైపు ఆకర్షితులయ్యారు. 2026లోని IPO సైకిల్ ఇన్వెస్టర్ల సృజనాత్మకతను,మార్కెట్ లోతును పరీక్షించబోతోంది. ఏదేమైనా, 2026లో రిలయన్స్ జియో వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నందున, సెన్సెక్స్,నిఫ్టీలో భారీ పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి వ్యూహాలను ముందే సిద్ధం చేసుకోవడం మంచిది.