LOADING...
Mutual Funds: 9 నెలల్లో 20% పైగా రాబడి! టాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..
9 నెలల్లో 20% పైగా రాబడి! టాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..

Mutual Funds: 9 నెలల్లో 20% పైగా రాబడి! టాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో పెట్టుబడి అలవాట్లు వేగంగా మారుతున్నాయి. తక్కువ రిస్క్‌తో మంచి రాబడులు ఇచ్చే ఆప్షన్లపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతమవుతోంది. అందులో భాగంగా మ్యూచువల్ ఫండ్లు చాలా మందికి నమ్మదగిన పెట్టుబడి మార్గంగా మారాయి. ముఖ్యంగా గత తొమ్మిది నెలల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అంచనాలను మించిన ప్రదర్శన కనబర్చాయి. ఈ కాలంలో 20% పైగా రాబడి ఇచ్చిన 15 ఫండ్లు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ఈ జాబితాలో మిడ్ క్యాప్,స్మాల్ క్యాప్ వర్గాలు ముందు వరుసలో నిలిచాయి. ఇవి ఇచ్చిన లాభాలు దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులు పెట్టుబడిదారులకు మంచి వృద్ధి అవకాశాలు ఇస్తాయని మరోసారి నిరూపిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఆసక్తి ఉన్నవారు ఈ లిస్ట్‌ను ఆధారంగా తీసుకుని తమ ఎంపిక చేసుకోవచ్చు.

వివరాలు 

సంఖ్య ఫండ్‌ పేరు రిటర్న్లు (నవంబర్ 20 వరకు)

సంఖ్య ఫండ్‌ పేరు రిటర్న్లు(నవంబర్ 20 వరకు) 1 మిరే అసెట్ మిడ్‌క్యాప్ ఫండ్ 24.58 శాతం 2 ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ 24.50 శాతం 3 మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ 23.92 శాతం 4 WOC మిడ్ క్యాప్ ఫండ్ 23.60 శాతం 5 హీలియోస్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ 23.57 శాతం 6 TRUSTMF స్మాల్ క్యాప్ ఫండ్ 23.23 శాతం 7 మిరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్ 23.23 శాతం 8 HSBC మిడ్‌క్యాప్ ఫండ్ 23.07 శాతం 9 ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్ ఫండ్ 22.91 శాతం 10 హీలియోస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 22.13 శాతం

వివరాలు 

సంఖ్య ఫండ్‌ పేరు రిటర్న్లు (నవంబర్ 20 వరకు)

సంఖ్య ఫండ్‌ పేరు రిటర్న్లు(నవంబర్ 20 వరకు) 11 గ్రో మల్టీక్యాప్ ఫండ్ 21.79 శాతం 12 ఇన్వెస్కో ఇండియా లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ 20.87 శాతం 13 ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 20.83 శాతం 14 WOC మల్టీ క్యాప్ ఫండ్ 20.65 శాతం 15 యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.43 శాతం

వివరాలు 

అగ్రస్థానంలో మిడ్ క్యాప్ విభాగమే 

మొత్తం 281 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో కేవలం 17 ఫండ్లే 20% కన్నా ఎక్కువ రాబడి ఇచ్చాయి. అందులో కూడా మిడ్ క్యాప్ విభాగమే అగ్రస్థానంలో దూసుకెళ్లింది. మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన మిరే అసెట్ మిడ్‌క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ రెండూ 24% పైగా లాభం అందించాయి. స్మాల్ క్యాప్ విభాగంలో TRUSTMF స్మాల్ క్యాప్, మిరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్లు సుమారుగా 23% వరకు రాబడి ఇచ్చాయి. పెద్ద AMCలకు చెందిన ఫ్లెక్సిక్యాప్, మల్టీక్యాప్ ఫండ్లు కూడా 20% దాటాయి. ఇతరంగా చూసుకుంటే మిగిలిన 264 ఫండ్లు 2% నుండి 19.90% మధ్య రాబడి నమోదు చేశాయి.