Loading...
US: విదేశీ డ్రోన్లపై ట్రంప్ 100 శాతం సుంకాలు
US: విదేశీ డ్రోన్లపై ట్రంప్ 100 శాతం సుంకాలు

US: విదేశీ డ్రోన్లపై ట్రంప్ 100 శాతం సుంకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల్లో తయారయ్యే డ్రోన్లు,వాటి కొన్ని విడిభాగాలపై భారీగా సుంకాలు విధించారు. కొన్ని ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు 100 శాతం వరకు ఉండనున్నాయి. చైనా ఆధిపత్యం ఉన్న డ్రోన్ పరిశ్రమలో విదేశీ దిగుమతులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా కనిపిస్తోంది. గత నెలలోనే ట్రంప్ విదేశీ డ్రోన్లు,వాటి విడిభాగాలపై కొత్త సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా వాణిజ్య శాఖ చేపట్టిన దర్యాప్తులో.. డ్రోన్లు, వాటి భాగాల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడటం జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని తేలింది. ఈ నేపథ్యంలోనే తాజా టారిఫ్‌లను అమలు చేస్తున్నారు.

వివరాలు 

డ్రోన్లు, విడిభాగాలపై కొత్త సుంకాలు

అయితే ట్రంప్ కుటుంబానికి చెందిన ఆయన ఇద్దరు పెద్ద కుమారులకు అమెరికా డ్రోన్ పరిశ్రమతో సంబంధాలు ఉండటం వల్ల ఈ విధానంపై ఆసక్తి నెలకొంది.

25 కిలోల కంటే ఎక్కువ బరువున్న పెద్ద డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ సౌకర్యం ఉన్న డ్రోన్లపై అత్యధికంగా 100 శాతం సుంకం విధించారు.

చిన్న డ్రోన్లపై 25 శాతం దిగుమతి సుంకం ఉంటుంది.తక్కువ ప్రాధాన్యమున్న కొన్ని డ్రోన్ విడిభాగాలపైనా వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి సుంకాలు అమల్లోకి రానున్నాయి.

అమెరికా మిత్రదేశాలపై మాత్రం అత్యధిక సుంకాలను విధించలేదు. అయినప్పటికీ ఆయా దేశాల నుంచి వచ్చే డ్రోన్లపై టారిఫ్‌లు కొనసాగుతాయి.

యూరోపియన్ యూనియన్,జపాన్, దక్షిణ కొరియా,స్విట్జర్లాండ్,తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే డ్రోన్లపై 15 శాతం సుంకం ఉంటుంది.

వివరాలు 

టారిఫ్‌లపై చైనా తీవ్ర అభ్యంతరం

బ్రిటన్ నుంచి వచ్చే డ్రోన్లపై 10 శాతం టారిఫ్ విధించనున్నారు.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్రంగా స్పందించింది. కొత్త సుంకాల వల్ల ప్రపంచ డ్రోన్ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెచ్చరించారు.

అంతేకాకుండా ప్రపంచ మార్కెట్లో సమాన పోటీ వాతావరణం మరింత దెబ్బతింటుందని అన్నారు.

అమెరికా నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

జాతీయ భద్రతకు దిగుమతి చేసుకునే డ్రోన్లు, వాటి విడిభాగాల వల్ల ముప్పు ఉండొచ్చన్న ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ చర్యలు చేపడుతోంది.

దేశీయంగా డ్రోన్ల తయారీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా ఈ విధానంలో భాగంగా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

డీజేఐపై మరింత ప్రభావం

2006లో ఏర్పాటైన చైనాకు చెందిన డీజేఐ (DJI) ప్రపంచ డ్రోన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది.

ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచ మార్కెట్లో మూడింట రెండొంతులకు పైగా వాటాను ఈ సంస్థ కలిగి ఉంది.

అయితే 2022 నుంచి అమెరికా సైన్యంతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటున్న చైనా సంస్థల జాబితాలో డీజేఐ కూడా ఉంది.

దీంతో అమెరికా సాంకేతికతను పొందడంపై ఆ సంస్థకు ఆంక్షలు విధించారు.

తమను ఈ జాబితాలో చేర్చడాన్ని డీజేఐ వ్యతిరేకిస్తూ న్యాయపరంగా పోరాడుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి.

చైనాలో తయారయ్యే డ్రోన్లు, విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న అమెరికా విస్తృత వ్యూహంలో భాగంగా డీజేఐపై కూడా ఈ పరిమితులు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT