
Gold Price Today: తగ్గని పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పసిడి ధరలు నిరంతరంగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బంగారం లక్షా 15 వేల మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ హై స్థాయికి చేరుకుంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. సాధారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకసారి పెరిగితే, మరోసారి తగ్గుతాయి. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఈ రెండింటి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూడా బంగారం, వెండి రేట్లు పెరిగినట్టు సమాచారం.
Details
సెప్టెంబర్ 27, 2025, శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరలు ఇవే
24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,14,890 చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,05,310కి చేరింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి రూ.1,43,100గా ఉంది.
Details
ప్రధాన నగరాల్లో ధరలివే
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు - రూ.1,14,890, 22 క్యారెట్లు - రూ.1,05,310, వెండి కిలో - రూ.1,53,100. విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్లు - రూ.1,14,890, 22 క్యారెట్లు - రూ.1,05,310, వెండి కిలో- రూ.1,53,100. ఢిల్లీ: 24 క్యారెట్లు - రూ.1,15,040, 22 క్యారెట్లు - రూ.1,05,460, వెండి కిలో- రూ.1,43,100. ముంబై: 24 క్యారెట్లు - రూ.1,14,890, 22 క్యారెట్లు - రూ.1,05,310, వెండి కిలో - రూ.1,43,100. చెన్నై: 24 క్యారెట్లు - రూ.1,15,100, 22 క్యారెట్లు - రూ.1,05,510, వెండి కిలో - రూ.1,53,100. బెంగళూరు: 24 క్యారెట్లు - రూ.1,14,890, 22 క్యారెట్లు - రూ.1,05,310, వెండి కిలో - రూ.1,42,500.