LOADING...
యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం
యూనిలీవర్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌

యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 30, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్‌ కొనసాగుతారు. 51 ఏళ్ల హీన షూమేకర్ గత ఏడాది అక్టోబర్‌లో యూనిలీవర్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుతం డచ్ డెయిరీ బిజినెస్ ఫ్రైస్‌ల్యాండ్ కంపెనీ చీఫ్‌గా ఉన్నారు. ప్రస్తుత సిఈఓ అలాన్ జోప్ జనవరి 2019లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అలాన్ జోప్ సెప్టెంబరు 2022లో యూనిలీవర్ నుండి పదవీ విరమణ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. 2023 చివరిలో అలాన్ జోప్ పదవీ విరమణ చేసే అవకాశం ఉందని, యునిలీవర్ సంస్థ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ ను నియమిస్తున్నట్లు ట్వీట్ చేసిన యూనిలీవర్