Budget 2024: బడ్జెట్ 2024తో మారనున్న ధరలు.. ఏది చౌక, ఏది ఖరీదైనది.. పూర్తి జాబితా మీకోసం..
ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక పెద్ద ప్రకటనలు చేశారు. అనేక రకాల వస్తువుల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు., ఇది మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వీటిలో అతిపెద్ద ప్రకటన బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ. అంతేకాకుండా ప్లాటినంపై కస్టమ్ డ్యూటీని కూడా తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు 15 శాతంగా ఉంది. అంతేకాకుండా, ప్లాటినంపై కస్టమ్ డ్యూటీని కూడా 6.4%కి తగ్గించారు.
నిర్మలమ్మ బడ్జెట్‌లో చౌకాగా మారిన..
బడ్జెట్‌లో చేసిన ప్రకటన ప్రకారం, లెదర్, పాదరక్షలపై కస్టమ్ డ్యూటీని కూడా తగ్గించారు. PVC ఫ్లెక్స్ బ్యానర్‌లపై కస్టమ్ డ్యూటీ 10%కి తగ్గించారు. రొయ్యలు, చేపలు, దాణాపై కస్టమ్ డ్యూటీని 5%కి తగ్గించారు. 2 కీలకమైన కోబాల్ట్, లిథియం ఖనిజాలపై ఎక్సైజ్ సుంకం కూడా తగ్గించబడింది. ఇది కాకుండా మొబైల్ ఛార్జర్‌పై కస్టమ్ డ్యూటీని కూడా తగ్గించారు. బంగారం, వెండి, ప్లాటినం, లెదర్ పాదరక్షలు PVC ఫ్లెక్స్ బోర్డు రొయ్యలు, చేపలు, మేత కోబాల్ట్ లిథియం మొబైల్ ఛార్జర్
బడ్జెట్‌లో ఖరీదైనవి ఇవే..
ఇది కాకుండా, కొన్ని వస్తువులపై కస్టమ్ సుంకం కూడా పెరిగింది. టెలికాం పరికరాలు, అమ్మోనియం నైట్రేట్‌పై సుంకం పెంచబడింది. టెలికాం పరికరాలపై కస్టమ్ డ్యూటీ 15 శాతానికి పెరిగింది. అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్ డ్యూటీని 10%కి పెంచుతున్నట్లు ప్రకటించారు.