Page Loader
ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 
ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్

ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 

వ్రాసిన వారు Stalin
May 04, 2023
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక పక్క ఖర్చును తగ్గించుకునేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతుంటే, అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వేసవి ప్రయాణాలు పెరుగుతాయని భావిస్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టాలని యోచిస్తోంది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 7,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నామని ఎయిర్‌లైన్స్ చెప్పింది. ఈ సంవత్సరాంతానికి 15,000మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

అమెరికా

హైరింగ్ మోడ్‌లో ఉన్నాం: యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌

2026 నాటికి యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో 93,000 మంది ఉద్యోగులు ఉండాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇందుకోసం మరో 50వేల మంది ఉద్యోగులను నియమించాల్సి ఉందని, అది ఈ ఏడాది నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో హైరింగ్ మోడ్‌లో ఉన్నామని, కంపెనీ మానవ వనరుల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కేట్ గెబో విలేకరులతో అన్నారు. పీక్ సమ్మర్ షెడ్యూల్‌ను నిర్వహించడానికి తమ వద్ద ఇప్పటికే తగినంత మంది పైలట్లు ఉన్నారని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు.