Loading...
UPI MDR Charges: రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు.. ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం
రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు.. ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం

UPI MDR Charges: రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు.. ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థలో త్వరలోనే మార్పులు చోటుచేసుకోనున్నాయి. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నిబంధనలు 2026 అక్టోబర్ 15 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాటిని వాయిదా వేసింది. దీపావళి నవంబర్ 8తో ముగియడంతో పండుగల అనంతరం కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. మరి ఈ కొత్త నిబంధనలు ఎలా ఉండనున్నాయి? సాధారణ వినియోగదారుల ఖాతాల నుంచి కూడా డబ్బులు కట్ అవుతాయా? తెలుసుకుందాం.

వివరాలు 

యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్న ఎన్‌పీసీఐ

దీపావళి షాపింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ వారాంతంలో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, నిత్యావసర సరుకులు, గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా జరిగే అవకాశం ఉంది.

లక్షలాది మంది వినియోగదారులు ఆయా దుకాణాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.

అయితే ఈ సమయంలో డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులు కొత్త నిబంధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే ఎంపిక చేసిన యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు ఎన్‌పీసీఐ సిద్ధమవుతోంది.

దీపావళి తర్వాత ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చింది.

అయితే ఛార్జీలు ఏ తేదీ నుంచి అమలవుతాయనే విషయంపై మాత్రం అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

క్లారిటీ ఇచ్చిన ఎన్‌పీసీఐ స్టీరింగ్ కమిటీ

కొత్త ఛార్జీల అమలు నేపథ్యంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నవంబర్ 8న దీపావళి ముగిసిన వెంటనే, అంటే మరుసటి రోజు నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయా? లేక వ్యాపారులు కొత్త విధానానికి సిద్ధమయ్యేందుకు మరికొంత సమయం ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వాస్తవానికి 2026 అక్టోబర్ 15 నుంచే ఎండీఆర్ ఛార్జీలను అమలు చేయాలని తొలుత నిర్ణయించారు.

అయితే అక్టోబర్ 13న జరిగిన ఎన్‌పీసీఐ యూపీఐ, సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ తీర్మానించారు.

పండుగల సమయంలో కొత్త ఛార్జీలను అమలు చేయడం సరైనది కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎండీఆర్ ఛార్జీల అమలు 2027 జనవరి 1 వరకు వాయిదా

అయితే దీపావళి ముగిసిన తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ కచ్చితమైన తేదీని వెల్లడించలేదు.

మరోవైపు గతంలో వెలువడిన కొన్ని నివేదికలు కూడా ఈ అంశంపై ఆసక్తిని పెంచాయి.

ఎండీఆర్ ఛార్జీల అమలును 2027 జనవరి 1 వరకు వాయిదా వేయవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నట్లు సమాచారం.

అయితే ఈ తేదీపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాలక్రమ చర్చల్లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చినప్పటికీ, దాన్ని ఖరారైన నిర్ణయంగా పరిగణించకూడదు.

ADVERTISEMENT

వివరాలు 

దీపావళి వెళ్లిన వెంటనే ఈ ఛార్జీలను అమలు చేస్తామన్న ఎన్‌పీసీఐ

తాజాగా దీపావళి తర్వాతే కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్లు ఎన్‌పీసీఐ సంకేతాలివ్వడంతో వ్యాపారులు, పేమెంట్ అగ్రిగేటర్లు, బ్యాంకులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు సాధారణ వినియోగదారులపై ఈ ఛార్జీల భారం పడదని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

అంటే కొత్త ఎండీఆర్ నిబంధనలు ప్రధానంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించినవే కాగా, సాధారణంగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారుల ఖాతాల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయబోరనే భరోసా ఉంది.

ADVERTISEMENT