Infosys: ఇన్ఫోసిస్‌కు అమెరికా షాక్.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌పై కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వం అర్హులైన విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు పొందేందుకు కంపెనీలు స్పాన్సర్ చేయడానికి వీలు కల్పించే పర్మ్ (US PERM Programme) కార్యక్రమం నుంచి తమను సస్పెండ్ చేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. ఈ నిర్ణయం తమ వ్యాపార కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపదని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 'ట్రంప్ ప్రభుత్వం పర్మ్ ప్రోగ్రామ్ నుంచి ఇన్ఫోసిస్‌ను సస్పెండ్ చేసింది. అయితే ఈ నిర్ణయం మా కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నాం. అమెరికాలో సాంకేతికత, ఆవిష్కరణలు, స్థానిక ఉద్యోగుల నియామకాలపై మేం పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికాలో అమలులో ఉన్న అన్ని నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.
వివరాలు
8 దిగ్గజ ఐటీ కంపెనీలపై అమెరికా సస్పెన్షన్ వేటు
హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల కోసం గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు కంపెనీలను అనుమతించే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (PERM) నుంచి మైక్రోసాఫ్ట్, టాటా, ఇన్ఫోసిస్, విప్రో సహా మొత్తం ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలను అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల ప్రక్రియలో భాగంగా కంపెనీలు స్పాన్సర్ చేయడానికి పర్మ్ కార్యక్రమం కీలకంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది.
వివరాలు
ఇప్పటికే తగ్గిన భారత ఐటీ కంపెనీల పర్మ్ దరఖాస్తులు
అయితే, గత కొన్నేళ్లుగా భారతీయ ఐటీ కంపెనీలు గ్రీన్‌కార్డుల కోసం సమర్పిస్తున్న పర్మ్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ధోరణికి ఉదాహరణగా, అమెరికా ఆర్థిక సంవత్సరం 2026లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కేవలం రెండు పర్మ్ దరఖాస్తులు మాత్రమే సమర్పించడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో పర్మ్ కార్యక్రమం నుంచి సస్పెన్షన్ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదని ఇన్ఫోసిస్ భావిస్తోంది.
అమెరికాలో స్థానిక నియామకాలు, సాంకేతికత, ఆవిష్కరణలపై పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు సంస్థ తన ప్రకటనలో స్పష్టం చేసింది.