US Federal Reserve: ద్రవ్యోల్బణం కట్టడికి అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను 25బేసిస్ పాయింట్లు పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయించింది.దీంతో రేట్లు 3.75శాతం నుంచి 4శాతానికి చేరాయి. కొవిడ్ పరిణామాల తర్వాత వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు 2023లో ఫెడ్ ముగింపు పలికింది. ఆ తర్వాత మళ్లీ రేట్లు పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు గరిష్ఠ ఉపాధిలక్ష్యాలను సాధించడమే తాజా పెంపు ఉద్దేశమని ఫెడరల్ రిజర్వు పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లు మరోసారి పెరిగే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలు ఇచ్చారు. సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా'సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్'లో ఈ అంచనాలు వెల్లడయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో పెరిగిన వడ్డీ రేట్లు.. 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడరల్ రిజర్వు
US Fed delivers first rate hike in over 3 years as inflation lingers, Trump calls for 1% benchmark https://t.co/lAmZa23ZmI
— Business Today (@business_today) September 17, 2026