వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ వ్యూహాత్మక డీల్ పూర్తి
రిలయన్స్ స్టోరేజ్ లిమిటెడ్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ (గతంలో వయాకామ్‌సిబిఎస్‌గా పిలువబడేది)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి చేసినట్లు వయోకామ్18(Viacom18) ప్రకటించింది. ఎన్‌సీఎల్‌టీ ముంబై నిబంధనలను ప్రకారం, వయోకామ్18-రిలయన్స్ స్టోరేజ్ లిమిటెడ్ విలీన పథకం అమలులోకి వచ్చింది. బోధి ట్రీ సిస్టమ్స్, ఆర్ఐఎల్ గ్రూప్ సంస్థలకు వాటాలను కేటాయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విలీనం పూర్తయిన తర్వాత, జియో సీనిమాను వయాకామ్ 18తో అనుసంధానం కూడా పూర్తయ్యింది.
వయాకామ్18 ప్రణాళికాబద్ధమైన వృద్ధికి రూ. 15,145కోట్ల సమీకరణ
ఈ విలీనం ద్వారా వయాకామ్18 ప్రణాళికాబద్ధమైన వృద్ధికి రూ. 15,145 కోట్ల నగదు సమకూరనుంది. ఇందులో ఆర్‌ఐఎల్ గ్రూప్ సంస్థలు రూ. 10,839 కోట్లు, బోధి టిరీ సిస్టమ్ అందించిన రూ. 4,306 కోట్లు ఉన్నాయి. ఒప్పందం పూర్తయితే, టీవీ18(ముఖేష్ అంబానీ యాజమాన్యం) 50.994శాతం ఈక్విటీ వాటాను కలిగి ఉంటుంది. బోధి ట్రీ కంపెనీకి 0.011% వాటా ఉంటుంది. పారామౌంట్ గ్లోబల్ 48.994శాతాన్ని కలిగి ఉంటుంది. ఈ విలీనం భారతదేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థల డీల్‌గా వయోకామ్18 పేర్కొంది.