Page Loader
Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు
వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు

Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ మరోసారి ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. ఈసారి ఫిల్మ్, టీవీ, కార్పొరేట్ ఫైనాన్స్ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజా లేఆఫ్స్ డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్ డివిజన్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఫిల్మ్, టీవీ మార్కెటింగ్, పబ్లిసిటీ, క్యాస్టింగ్, డెవలప్‌మెంట్ రంగాల్లో ఈ ఉత్కంఠత మరింతగా కనిపిస్తోంది. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డిస్నీ టీవీ విభాగానికి చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఈ తొలగింపులకు గురయ్యారు.

Details

ఉద్యోగులను తొలగించడం ఇది నాలుగోసారి

ఉద్యోగుల తొలగింపులో ఇది డిస్నీకి నాలుగోసారి కావడం గమనార్హం. 2023లోనే డిస్నీ దాదాపు 7 వేల మందిని తొలగించింది. అప్పట్లో కంపెనీ తన వ్యయాన్ని 7.5 బిలియన్ డాలర్ల వరకు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా సుమారు 200 మంది ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ తొలగింపులపై పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్యోగ భద్రతపై ఉన్న అస్పష్టత, మారుతున్న మార్కెట్ పరిస్థితుల కారణంగా డిస్నీ తన వ్యూహాలను మార్చుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.