LOADING...
Samsung phones: శాంసంగ్ యూజర్లకు హెచ్చరిక.. వాట్సప్‌ ఫొటోలు ఫోన్‌ హ్యాక్‌ చేయవచ్చు
శాంసంగ్ యూజర్లకు హెచ్చరిక.. వాట్సప్‌ ఫొటోలు ఫోన్‌ హ్యాక్‌ చేయవచ్చు

Samsung phones: శాంసంగ్ యూజర్లకు హెచ్చరిక.. వాట్సప్‌ ఫొటోలు ఫోన్‌ హ్యాక్‌ చేయవచ్చు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ నేరగాళ్ల కొత్త పన్నాగం శాంసంగ్‌ ఫోన్‌ యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. గుర్తు తెలియని వాట్సాప్‌ ఖాతాల నుంచి వచ్చే చిత్రాలను ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటిని క్లిక్‌ చేయగానే 'ల్యాండ్‌ఫాల్‌' అనే ప్రమాదకరమైన స్పైవేర్‌ మన ఫోన్‌లోకి చొరబడుతోంది. ఈ మాల్వేర్‌ శాంసంగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాన్ని దుర్వినియోగం చేసుకుంటూ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తోంది. అమెరికాకు చెందిన 'పాలోఆల్టో నెట్‌వర్క్‌' సంస్థ ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఈ స్పైవేర్‌ ఫోన్‌లోకి ప్రవేశించిన తర్వాత నిజమైన గూఢచారి మాదిరిగా ప్రవర్తిస్తుంది. అది కాల్స్‌పై నిఘా పెడుతుంది, లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తుంది, కాంటాక్ట్‌లను పర్యవేక్షిస్తుంది.

Details

ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరించారు

ముఖ్యంగా ఇరాన్‌, ఇరాక్‌, మొరాకో, తుర్కియే దేశాల్లోని గెలాక్సీ S22, S23,S24, Z ఫోల్డ్‌ 4, Z ఫ్లిప్‌ 4యూజర్లను ఈ దాడికి గురి చేసినట్లు గుర్తించారు. పాలోఆల్టో నెట్‌వర్క్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్పైవేర్‌ 2024మధ్యకాలంలోనే చురుకుగా పనిచేస్తోంది. శాంసంగ్‌కు సెప్టెంబర్‌ 2024లో సమాచారం ఇచ్చినా, సంస్థ ఏప్రిల్‌ 2025లో మాత్రమే తగిన చర్యలు ప్రారంభించింది. దాంతో దాదాపు ఆరు నెలల పాటు హ్యాకర్లు లక్ష్యంగా చేసిన ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరించగలిగారని వెల్లడించింది. ప్రస్తుతం శాంసంగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఆ లోపం సరిచేయబడిందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ సంఘటనతో హ్యాకర్లకు ఏ ఫోన్‌ కూడా పూర్తిగా సురక్షితం కాదని స్పష్టమైంది. ఈ ఘటన వెలుగులోకి రావడానికి కారణమైనది.

Details

అప్రమత్తంగా ఉండాలి

గూగుల్‌ ఆధ్వర్యంలోని వైరస్‌ టోటల్‌ అనే పబ్లిక్‌ మాల్వేర్‌ డేటాబేస్‌. వినియోగదారులు అనుమానాస్పద ఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేయగా, పాలోఆల్టో నెట్‌వర్క్‌లోని 'యూనిట్‌ 42' బృందం ఈ మాల్వేర్‌ చలామణి అవుతున్నట్లు గుర్తించింది. దీనిలో ఆర్థిక లాభాల కంటే గూఢచర్యమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని సంస్థ పేర్కొంది. శాంసంగ్‌ ఫోన్లను తాజా అప్‌డేట్స్‌తో అప్డేట్‌ చేసుకున్న యూజర్లు మాత్రం సురక్షితంగా ఉన్నారని కూడా సంస్థ ధృవీకరించింది. అయితే గుర్తు తెలియని వాట్సాప్‌ ఖాతాల నుంచి వచ్చే చిత్రాలు లేదా ఫైల్స్‌ను తెరవడంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.