Loading...
Warren Buffett: 56 ఏళ్ల ఛైర్మన్‌ పదవికిఛైర్మన్‌గా బఫెట్‌ గుడ్‌బై.. బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌గా హోవర్డ్
బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌గా హోవర్డ్

Warren Buffett: 56 ఏళ్ల ఛైర్మన్‌ పదవికిఛైర్మన్‌గా బఫెట్‌ గుడ్‌బై.. బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌గా హోవర్డ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) బెర్క్‌షైర్‌ హాత్‌వే (Berkshire Hathaway) ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు. ఐదు దశాబ్దాలకు పైగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. తాజాగా పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. గౌరవ ఛైర్మన్‌గా.. 96 ఏళ్ల వారెన్‌ బఫెట్‌ ఇకపై బెర్క్‌షైర్‌ హాత్‌వేలో గౌరవ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. అలాగే, కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గానూ తన సేవలను కొనసాగిస్తారని సంస్థ వెల్లడించింది. బఫెట్‌ తనయుడు హోవర్డ్‌ బెర్క్‌షైర్‌ హాత్‌వే కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 1993 నుంచి హోవర్డ్‌ కంపెనీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.

వివరాలు 

వస్త్ర పరిశ్రమ నుంచి విభిన్న రంగాల్లోకి..

ఈ సందర్భంగా వారెన్‌ బఫెట్‌ వాటాదారులకు లేఖ రాశారు. ''కాలమే ఎప్పుడూ గెలుస్తుంది. అయినప్పటికీ ఆ కాలం నా పట్ల కాస్త ఉదారత చూపించింది'' అని ఆయన పేర్కొన్నారు.

వారెన్‌ బఫెట్‌ 1970లో బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

అప్పట్లో వస్త్ర పరిశ్రమకు పరిమితమైన కంపెనీని ఆయన క్రమంగా బీమా రంగం వైపు మళ్లించారు.

అనంతరం టెక్స్‌టైల్, బీమా, రైల్‌రోడ్స్, కన్జ్యూమర్‌ బ్రాండ్లు, ఈక్విటీల వంటి విభిన్న రంగాల్లోకి మూలధనాన్ని మళ్లిస్తూ సంస్థను విస్తరించారు.

క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానం, దీర్ఘకాలిక వ్యూహాలతో బఫెట్‌ అనుసరించిన మదుపు సూత్రాలు వాటాదారులకు గణనీయమైన లాభాలను అందించాయి.

దీంతో ఆయన స్టాక్‌మార్కెట్‌ ప్రపంచంలో గొప్ప ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు.

వివరాలు 

ఇప్పటికే సీఈవో పదవి నుంచి వైదొలిగిన బఫెట్

పెట్టుబడులతో అపర కుబేరుడిగా ఎదిగిన బఫెట్‌ చెప్పిన, పాటించిన మదుపు సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా నిలిచాయి.

వారెన్‌ బఫెట్‌ గతేడాది చివర్లోనే బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈవో పదవి నుంచి వైదొలిగారు.

ఆయన స్థానంలో గ్రెగ్‌ అబెల్‌ (Greg Abel) కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు.

తాజాగా ఛైర్మన్‌ పదవి నుంచి కూడా బఫెట్‌ తప్పుకోవడంతో బెర్క్‌షైర్‌ హాత్‌వే నాయకత్వంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది.

ADVERTISEMENT