Stock Market: పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్ కీలక గ్యాస్ చమురు క్షేత్రాలపై దాడులు జరపడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. సరఫరా అంతరాయాలపై పెరిగిన ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 3 శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Details
1,499 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ఉదయం 9.29 గంటల సమయానికి సెన్సెక్స్ 1,499 పాయింట్లు పడిపోయి 75,204 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 452 పాయింట్లు క్షీణించి 23,324 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రూపాయి కూడా బలహీనపడుతూ డాలర్‌తో పోలిస్తే 92.89 వద్ద జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది. నిఫ్టీ సూచీలో ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు స్వల్ప లాభాల్లో నిలవగా, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్ & టుబ్రో, టీఎంపీవీ, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.