Page Loader
Debentures : డిబెంచర్లు అంటే ఏమిటి.. మదుపరులు తెలుసుకోవాల్సిన విషయాలివే! 
డిబెంచర్లు అంటే ఏమిటి.. మదుపరులు తెలుసుకోవాల్సిన విషయాలివే!

Debentures : డిబెంచర్లు అంటే ఏమిటి.. మదుపరులు తెలుసుకోవాల్సిన విషయాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

డిబెంచర్ అనేది ఒక రకాల రుణ సాధనం. సంస్థలు, కంపెనీలు లేదా ప్రభుత్వాలు తమకు అవసరమైన నిధులను సమీకరించేందుకు మదుపరులకు ఇవి జారీ చేస్తుంటాయి. అయితే ఈ డిబెంచర్లకు ఎటువంటి భౌతిక ఆస్తులు తాకట్టుగా ఉండవు. అవి పూర్తిగా జారీచేసే సంస్థ పరపతి, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయి. డిబెంచర్లను వాటి లక్షణాల ప్రకారం వివిధ రకాలుగా విభజించవచ్చు. వాటిని ఒకసారి పరిశీలిస్తే కన్వర్టబుల్ డిబెంచర్(Convertible Debenture) డిబెంచర్‌ను నిర్ణీత కాలానంతరం కంపెనీ ఈక్విటీ షేర్లుగా మార్చుకునే అవకాశాన్ని మదుపరులకు ఇస్తాయి. దీనివల్ల రుణదాతలుగా ఉన్న వారు ఆ సంస్థ షేర్‌హోల్డర్లుగా మారతారు. ఈ డిబెంచర్లు మార్కెట్‌కు అనుసంధానమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. షేర్ విలువ పెరిగితే లాభాలు, తగ్గితే నష్టాలు వస్తాయి.

Details

 నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ (Non-Convertible Debenture) 

ఇవి ఎప్పటికీ షేర్లుగా మారవు. వాటికి నిర్ణీత కాలపరిమితి, స్థిర వడ్డీ రేటు ఉంటాయి. ఈ డిబెంచర్లపై చెల్లింపులు మెచ్యూరిటీ వరకు స్థిరంగా ఉంటాయి. రిజిస్టర్డ్ డిబెంచర్ (Registered Debenture) జారీ సంస్థలు డిబెంచర్ హోల్డర్ల సమాచారాన్ని రిజిస్టర్‌లో నమోదు చేస్తాయి. పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటివి నమోదు చేయడం ద్వారా భద్రతా ప్రామాణికతను కల్పిస్తాయి. అన్‌రిజిస్టర్డ్ డిబెంచర్ (Unregistered Debenture) ఇవి బేర్‌ర్ ఫారంలో ఉంటాయి. హోల్డర్ల సమాచారం రికార్డు చేయబడదు. వీటిని సులభంగా సెకండరీ మార్కెట్‌లో విక్రయించవచ్చు, బదలాయించవచ్చు. రిడీమబుల్ డిబెంచర్ (Redeemable Debenture) ఇవే అత్యంత సాధారణమైన డిబెంచర్‌లు. నిర్ణీత మెచ్యూరిటీ తేదీతో వస్తాయి. అప్పటికి సంస్థ డిబెంచర్లను తిరిగి కొనుగోలు చేయాలి.

Details

ఇర్రీడీమబుల్ డిబెంచర్ (Irredeemable Debenture) 

వీటికి మెచ్యూరిటీ తేదీ ఉండదు. సంస్థ తిరిగి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండదు. అయితే వడ్డీ చెల్లింపులు దశలవారీగా జరుగుతుంటాయి. సెక్యూర్డ్ డిబెంచర్(Secured Debenture) ఇవి కంపెనీ ఆస్తులతో తాకట్టు పెట్టి జారీ చేయబడతాయి. సంస్థ చెల్లింపులు చేయకపోతే, ఆస్తులను విక్రయించి మదుపరులు తమ డబ్బు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అన్‌సెక్యూర్డ్ డిబెంచర్ (Unsecured Debenture) ఎటువంటి ఆస్తుల భద్రతా లేకుండా జారీ అవుతాయి. రిస్క్ అధికంగా ఉన్నా, ఎక్కువ రాబడులు సాధ్యపడతాయి. కంపెనీ పరపతిపై మాత్రమే ఆధారపడతాయి. ఇవేకాకుండా ప్రీఫర్డ్ డిబెంచర్, ఆర్డినరీ డిబెంచర్, పాక్షిక కన్వర్టబుల్ డిబెంచర్ వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన డిబెంచర్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. ప్రతి రకానికి తగిన మదుపు విజ్ఞానం అవసరం.