
Google layoffs: గూగుల్ లేఆఫ్స్ కలకలం.. హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగులకు బిగ్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతోందన్న వార్తలు భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రకటనలు, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ తొలగింపు ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం. అయితే గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
అయినా వచ్చే వారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది.
ఇటీవల గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టి ప్రపంచవ్యాప్తంగా వందలాది ఉద్యోగులను తొలగించింది.
ఈ విభాగం ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది.
Details
ఉద్యోగులకు సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికల
కంపెనీ అభివృద్ధి చెందుతున్న వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే టెక్నికల్ ఉద్యోగుల విషయంలో గూగుల్ మరింత మెత్తనైన వైఖరిని అనుసరించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
హైదరాబాద్, బెంగళూరులోని ఇంజినీరింగ్ ఉద్యోగులను నేరుగా తొలగించకుండా, లాభదాయకమైన ఇతర ప్రాజెక్టులపై బదిలీ చేసే యోచనలో ఉందని తెలుస్తోంది.
గత సంవత్సరం గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ విభాగాలను విలీనం చేసింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు స్వచ్ఛంద విరమణ పథకాలను ప్రవేశపెట్టింది.
Details
విలీనంలో భాగంగా తొలగింపులు జరిగాయి
ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ, ఈ విలీనంలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా, జనవరిలో ఉద్యోగులకు స్వచ్ఛందంగా సంస్థ విడిచిపెయ్యేందుకు అవకాశాలు కల్పించామని కూడా తెలిపారు.
తాజా పరిణామాలతో బెంగళూరు, హైదరాబాద్‌లోని గూగుల్ ఉద్యోగుల్లో భవిష్యత్ భద్రతపై ఆందోళన పెరిగింది.
కంపెనీ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ సంక్షోభాన్ని గూగుల్ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే.